Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

FilmyFocus 3 weeks ago

యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా వెండితెరను ఏలిన సీనియర్ హీరో రాజశేఖర్(Rajashekhar).. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌ ను కూడా ప్రారంభించి విభిన్నమైన పాత్రలు ఎంపిక చేసుకుంటున్నారు.

Rajasekhar

ఇటీవల వచ్చిన శర్వానంద్ 'బైకర్' సినిమాలో పవర్ఫుల్ ఫాదర్ క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ను మెప్పించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన లవ్, మ్యారేజ్ లైఫ్‌కి సంబంధించిన ఎన్నో సీక్రెట్స్ బయటపెట్టారు.

ముఖ్యంగా నటి శ్రీదేవికి, తనకు మధ్య వచ్చిన పెళ్లి ప్రపోజల్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రాజశేఖర్, జీవిత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లికి ముందు తన ఫ్యామిలీలో జరిగిన హై-డ్రామాను ఆయన వివరించారు. తన పెళ్లి గురించి ఇంట్లో డిస్కషన్ జరుగుతున్నప్పుడు.. మొదట హీరోయిన్ శ్రీదేవి సంబంధం వచ్చిందట. ఇద్దరిదీ ఒకే కులం కావడంతో శ్రీదేవినే పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు గట్టిగా పట్టుబట్టారట.

ఇదే విషయాన్ని తను వెళ్లి జీవితకు చెప్పగా.. 'మీరు వేరే పెళ్లి చేసుకుంటే మీ ఇష్టం, కానీ నేను మాత్రం జీవితాంతం సింగిల్‌గానే ఉండిపోతాను' అని ఆమె ఆన్సర్ ఇచ్చిందట. ఆ మాటతో తాను ఒక్కసారిగా షాక్ అయ్యానని రాజశేఖర్ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.ఇక జీవితతో తన ప్రేమ విషయం చెప్పినప్పుడు జరిగిన మరో ఆసక్తికరమైన సంఘటనను కూడా ఆయన పంచుకున్నారు. ఆయన ప్రేమ విషయం తెలియక వాళ్ల అమ్మ మరో సంబంధం చూశారట.

ఇద్దరిలో ఎవర్ని ఫిక్స్ చేయాలో తెలియక ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఒకేసారి గుడికి రమ్మన్నారట రాజశేఖర్. తీరా గుడికి వెళ్లాక చూస్తే.. ఆ ఇద్దరూ స్కూల్ ఫ్రెండ్స్ కావడంతో ఒకరినొకరు చూసుకుని షాక్ అయ్యారని ఆయన నవ్వుతూ చెప్పారు. ఫైనల్‌గా ఆ డ్రామా అంతా ముగిసి జీవిత ప్రేమ గెలిచింది.ఇదే ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి చెబుతూ.. డాక్టర్ అవ్వాలని ఫ్యామిలీ పట్టుబట్టినా, యాక్టింగ్ పిచ్చితో ఇంట్లోంచి బయటికొచ్చేసినట్లు చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu