‘మేమ్ ఫేమస్’ అనే యూత్‌ఫుల్ మూవీతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు సుమంత్ ప్రభాస్. మొదటి సినిమాతోనే నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్..
దాదాపు 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘గోదారి గట్టుపైన’ అనే ఫ్యామిలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Raju Weds Rambai
మే 8న ఈ సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో సుమంత్ ప్రభాస్ పాల్గొన్నాడు.’మేమ్ ఫేమస్’ విజయం సాధించడంతో సుమంత్ ప్రభాస్ కి చాలా ఆఫర్లు వచ్చాయట.

కానీ తొందరపడకుండా.. మంచి కథ ఎంపిక చేసుకోవాలనే ప్రాసెస్ లో దాదాపు 50 కథలను అతను రిజెక్ట్ చేశాడట. ఇందులో హిట్ అయిన సినిమా కథలు ఉన్నాయట. అందులో ‘రాజు వెడ్స్ రాంబాయి'(Raju Weds Rambai) ఒకటని అతను రివీల్ చేశాడు.దర్శకుడు సాయిలు మొదట ఈ కథని సుమంత్ ప్రభాస్ కే వినిపించాడట. కథ నచ్చినప్పటికీ… దీని నేపథ్యం కూడా ‘మేమ్ ఫేమస్’ లాగే తెలంగాణ గ్రామీణ వాతావరణంలో ఉందని భావించి వద్దనుకున్నాడట.

