Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ramayana: 'రామాయణ'లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: 'రామాయణ'లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

FilmyFocus 2 weeks ago

'రామాయణ' సినిమా ట్రైలర్‌ను కొన్ని రోజుల క్రితం మీడియాకు, దగ్గరి వాళ్లకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. వెంటనే యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసేస్తారు అనుకుంటే అంతర్జాతీయ స్థాయి రిలీజ్‌ చేస్తాం అంటూ 'స్పైడర్‌ మ్యాన్‌' సినిమాకు లింక్‌ చేసి బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్‌ చేశారు.

అయితే అప్పుడు టెలీకాస్ట్‌ చేసినప్పుడు కానీ, ఇప్పుడు యూట్యూబ్‌కి వచ్చినప్పుడు కానీ ఓ పాత్రకు సంబంధించి ఎక్కడా పెద్దగా చర్చ జరగలేదు. అయితే పట్టించి చూస్తే ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ రెండు పాత్రల్లో నటించాడు అనే మాట ఒకటి బయటకు వచ్చింది.

Ramayana

అదే పరశురాముడి పాత్ర. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' సినిమాలో రణబీర్ శ్రీరామునిగా మాత్రమే కాకుండా మరో అవతారంలోనూ కనిపించనున్నాడని చెప్పారు. శ్రీమహావిష్ణువు మరో అవతామైన పరశురాముని పాత్రలోనూ రణ్‌బీర్‌ కనిపించనున్నాడు. ట్రైలర్‌లోని ఓ ఫ్రేమ్‌లో పరశురాముడు దివ్య ధనుస్సు ధరించి శ్రీరాముని ముందు మోకాళ్ల మీద కూర్చున్నట్లు కనిపిస్తాడు. పొడవాటి జుట్టు, గడ్డం, మీసాలతో ఆ పాత్ర కనిపిస్తుంది. ఆ పాత్రలో నటించి రణ్‌వీర్‌ సింగ్‌ అని తొలుత కొందరు అనుకున్నారు. కానీ అది రణ్‌బీర్‌ అని ఇప్పుడు టీమ్‌ చెప్పింది.

ఇక ఈ సినిమాలో సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, భరతుడిగా ఆదినాథ్ కొఠారే, శతృఘ్నుడిగా నితీశ్ శర్మ, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, దశరథుడిగా అరుణ్ గోవిల్, కౌసల్యగా ఇందిరా కృష్ణన్, కైకేయిగా లారా దత్తా, సుమిత్రగా సోనల్ ఝా, వశిష్ట మహర్షిగా శిశిర్ వర్మ, మంధర పాత్రలో షీబా చద్దా, విశ్వామిత్రుడిగా అజింక్య దేవ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

రూ.4 వేల కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి పార్టు ఈ దీపావళికి, రెండో పార్టు వచ్చే ఏడాది దీపావళికి వస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu