Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

FilmyFocus 1 day ago

'పెద్ది'.. రామ్‌చరణ్‌కు 16వ సినిమా 'పెద్ది' ప్రారంభం కాకముందే.. ఇంకా చెప్పాలంటే ఓకే కాకముందే 17వ సినిమా ఓకే అయింది అనే విషయం మీకు తెలిసిందే.

చరణ్‌కు 'రంగస్థలం' లాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా ఇచ్చిన సుకుమార్‌ దర్శకత్వంలో ఆ సినిమా ఉంటుంది అని అప్పుడు చెప్పేశారు. అంతేకాదు సినిమాలో రామ్‌చరణ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ కూడా షూట్‌ చేసేశారు. అయితే.. ఏమైందో ఏమో 16వ సినిమా అయిపోయి ఇన్నాళ్లు అయినా 17వ సినిమా స్టార్ట్‌ చేయలేదు.

RC 17

దీంతో వంటగాళ్లు కొత్త వంటకు శ్రీకారం చుట్టేశారు. ఆ సినిమా లేదని, ఇంకో సినిమా చేసుకోవాల్సి వస్తోందని చరణ్‌ను ఉద్దేశించి రూమర్లు వండేశారు. కానీ ఆ సినిమా అలానే ఉందని సినిమా టీమ్‌ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయట. డిసెంబరు నుండి సినిమా షూటింగ్‌ మొదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. విజయదశమి సందర్భంగా సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారు అని అంటున్నారు. ఈలోగా నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఖరారు చేయనున్నారట.

మరోవైపు సినిమా కోసం చరణ్‌ కొత్త లుక్‌లో కనిపించడానికి రెడీ అవుతున్నాడు. దీని కోసం బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక కథ విషయానికొస్తే గతంలో అనుకున్నట్లుగా విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో కాకుండా.. సిటీ బ్యాక్‌డ్రాప్‌ కోసమే ట్రై చేస్తున్నారట. గతంలో (వన్‌ నేనొక్కడినే) చేసిన మిస్టేక్స్‌ను మనసులో పెట్టుకుని సుకుమార్‌ ఈసారి కథ కోసం టీమ్‌తో గట్టిగానే కుస్తీ పడుతున్నారట. అందుకే సినిమా లేట్‌ అవుతోంది అని సమాచారం.

'రంగస్థలం', 'పెద్ది' సినిమాల్లా విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ ఎంచుకుంటే.. అవే సినిమాలు మళ్లీ తీశారు అనే మాట రావొచ్చనే ఉద్దేశంలో ఈ సారి మొత్తం సెటప్‌ మార్చేస్తున్నారట. ఈ విషయాలన్నీ మనకు తెలియకపోయినా.. సినిమా అప్‌డేట్ మాత్రం ఈ వినాయకచవితికి ఇస్తారు అని చెబుతున్నారు. ఇక ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని.. ఒకరు బాలీవుడ్ నుండి రానుండగా.. ఇంకొకరు సౌత్‌ సినిమా నుండి ఉంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu