Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

FilmyFocus 6 days ago

టీవల 'వీధి కుక్కలని హతమార్చాలి' అంటూ గవర్నమెంట్ జారీ చేసి జీవో పై నటి రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వీధుల్లో లేదా సందుల్లో ఉండే వీధి కుక్కల కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.

Renu Desai

కొందరు చిన్నారుల ప్రాణాలని సైతం బలితీసుకున్న ఘటనలు అందరికీ తెలుసు.కానీ వీటిని రేణు దేశాయ్(Renu Desai) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఇష్యూ పై ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్లో రేణు దేశాయ్.. కొందరు విలేకరులతో వాగ్వాదాలకి దిగింది.

తర్వాత ట్రోలింగ్ భారిన పడింది. అయితే ఇటీవల ఆమె పాల్గొన్న ఓ ఫ్యాన్ మీట్లో ఆ ఇష్యూపై వివరణ ఇచ్చింది.ఇదే క్రమంలో తన కుమారుడు అఖీరా నందన్ కి జరిగిన ఓ ప్రమాదాన్ని కూడా గుర్తుచేసుకుంది.రేణు దేశాయ్ మాట్లాడుతూ.. “అఖీరా నందన్ చిన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా సైక్లింగ్ చేసేవాడు. అయితే ఒకసారి తన ఫ్రెండ్స్ తో కలిసి సైక్లింగ్ కి వెళ్ళినప్పుడు రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల కిందపడి గాయపడ్డాడు. అఖీరా మొహంపై పెద్ద గాయం అయ్యింది.చెయ్యి విరిగింది.

అఖీరా మొహంపై ఆ మచ్చ ఇప్పటికీ అలానే ఉంది. ఇదంతా కుక్కల కారణంగా జరగలేదు కదా.! గవర్నమెంట్ వాళ్ళు రోడ్లు సరిగ్గా వేయకపోవడం వల్ల ఇదంతా జరిగింది.రహదారుల నాణ్యత, ప్రజల భద్రత ఎంత ప్రాముఖ్యమనేది ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఏ ఒక్కరికో జరిగిన నష్టంలా కాదు… నిత్యం రోడ్లపై ప్రయాణించే ప్రతి సామాన్యుడి భద్రతకు సంబంధించిన విషయంగా పరిగణించాలి.కుక్కలని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. రోడ్లు ” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu