Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

FilmyFocus 5 days ago

రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా రేణు దేశాయ్ చాలా యాక్టివ్ గా ఉంటారు అనేది అందరికీ తెలిసిందే.

Renu Desai

ముఖ్యంగా సోషల్ ఇష్యూస్ ను అడ్రెస్ చేయడంలో రేణు దేశాయ్ ముందుటారు. ఆమె పోస్టులు చాలా విప్లవాత్మకంగా ఉంటాయి. కాబట్టి.. కచ్చితంగా ఆమె భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారేమో అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

అలాంటి వారందరికీ క్లారిటీ ఇచ్చేశారు రేణు దేశాయ్. ఇటీవల ఆమె పాల్గొన్న ఓ ఫ్యాన్ మీట్లో .. ‘భవిష్యత్తులో మీరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారా? లేదంటే ఏ పార్టీకైనా మద్దతుగా నిలబడే అవకాశం ఉందా?’ అంటూ యాంకర్.. రేణు దేశాయ్ ని ప్రశ్నించాడు.అందుకు రేణు దేశాయ్ బదులిస్తూ.. “నాకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదు. నాకు రాజకీయాలు సెట్ అవ్వవు. నేను ముక్కుసూటి మనిషిని.

రాజకీయాల పరంగా సపోర్ట్ చేసేంత కెపాసిటీ కూడా నాకు లేదు. నేను వర్త్ కూడా కాదు. ‘ఐ యామ్ ది భక్త్ ఆఫ్ మోడీ’ అని చెప్పడానికి కారణం నేను బీజేపీ సపోర్టర్..ని కాబట్టి..! నేను చిన్నప్పటి నుండి బీజేపీ సపోర్టర్..ని..! మోడీజీ బీజీపీని రిప్రెజెంట్ చేస్తారు కాబట్టి.. నేను మోడీ భక్త్ అని చెప్పుకుంటాను.ఒకవేళ మోడీ కనుక వేరే పార్టీకి షిఫ్ట్ అయితే.. నేను మోడీని లైక్ చేయను.ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. మోడీ ప్రధాని కాబట్టి నేను ఆయన్ని పొగుడుతున్నాను అనేది కరెక్ట్ కాదు” అంటూ చెప్పుకొచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu