Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sita Ramam Collections: 'సీతా రామం' కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: 'సీతా రామం' కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

FilmyFocus 1 week ago

దుల్కర్ సల్మాన్ స్ట్రైట్ తెలుగు సినిమాల్లో నటిస్తూ ఇక్కడ కూడా మార్కెట్ పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. 'మహానటి' తో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.

'వైజయంతీ మూవీస్' సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అదే బ్యానర్లో దుల్కర్ నటించిన మరో సినిమా 'సీతా రామం'(Sita Ramam). హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. మొదట ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ 2022 ఆగస్టు 5న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

Sita Ramam

ఆ తర్వాత స్లోగా బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా పెరిగాయి. దుల్కర్ నటన, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, హను రాఘవపూడి నటన కలగలిపి ఈ సినిమాని సూపర్ హిట్ గా నిలబెట్టాయి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం10.06 cr
సీడెడ్1.98 cr
ఉత్తరాంధ్ర3.60 cr
ఈస్ట్2.03 cr
వెస్ట్1.30 cr
గుంటూరు1.70 cr
కృష్ణా1.80 cr
నెల్లూరు0.92 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)23.39 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా2.92 cr
ఓవర్సీస్7.30 cr
మిగిలిన వెర్షన్లు8.28 cr
హిందీ4.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్)46.19 cr

'సీతా రామం' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.46.19 కోట్ల షేర్ ను రాబట్టింది. హిందీ వెర్షన్ ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ అక్కడ కూడా భారీ వసూళ్లు సాధించింది. ఫైనల్ గా 'సీతా రామం' బాక్సాఫీస్ వద్ద రూ.29.19 కోట్ల ప్రాఫిట్స్ ను బయ్యర్స్ కి అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకుంది.

'బింబిసార' కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu