Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srirastu Subhamastu: అల్లు శిరీష్ 'శ్రీరస్తు శుభమస్తు'కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ 'శ్రీరస్తు శుభమస్తు'కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

FilmyFocus 2 days ago

ల్లు శిరీష్.. కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలే చేస్తూ వచ్చాడు. పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరోనే అయినప్పటికీ.. కమర్షియల్ మీటర్లో మాత్రమే కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలే చేస్తూ వచ్చాడు.ఈ దశలో అతనికి ప్రేమకథలు, ఫ్యామిలీ సినిమాలు బాగా కలిసొచ్చాయి.

‘కొత్త జంట’ తర్వాత అల్లు శిరీష్ కి మంచి సక్సెస్ ఇచ్చిన సినిమా అంటే ‘శ్రీరస్తు శుభమస్తు'(Srirastu Subhamastu) అనే చెప్పాలి. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్.

Srirastu Subhamastu

2016 ఆగస్టు 5న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదట్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద బాగానే నిలదొక్కుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తికావస్తోన్న సందర్భంగా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం2.65 cr
సీడెడ్1.35 cr
ఉత్తరాంధ్ర1.65 cr
ఈస్ట్0.78 cr
వెస్ట్0.70 cr
గుంటూరు0.83 cr
కృష్ణా0.80 cr
నెల్లూరు0.31 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)9.07 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్0.98 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)10.05 cr

'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.8.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.10.05 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు రూ.1.7 కోట్ల లాభాలు అందించి డీసెంట్ హిట్ అనిపించుకుంది.

'సీతా రామం' కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu