Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

FilmyFocus 6 months ago

‘కలర్స్ స్వాతి’ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె అసలు పేరు స్వాతి రెడ్డి(Swathi Reddy) అయినప్పటికీ.. కలర్స్ ని తన ఇంటిపేరుగా మార్చేసుకుని ‘కలర్స్ స్వాతి’ అయ్యింది.

Swathi Reddy

బుల్లితెరపై సూపర్ క్రేజ్ సంపాదించుకున్న తర్వాత ఈమె హీరోయిన్ గా కూడా మారి.. ‘ఆష్టా చమ్మా’ ‘స్వామి రారా’ ‘కార్తికేయ’ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. పక్కింటి అమ్మాయి ఇమేజ్ సొంతం చేసుకుంది.వ్యక్తిగతంగా చూసుకుంటే స్వాతి ముక్కుసూటి మనిషి.

ఫిల్టర్స్ లేకుండా నేచురల్ గా మాట్లాడుతుంది. ఈమె మాటల్లో వణుకు, భయం వంటివి కనిపించవు.అదే ఆటిట్యూడ్ తో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వాతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు పెళ్లి చేసుకునే వారి మెంటాలిటీ, వారి లైఫ్ స్టయిల్ గురించి తనశైలిలో స్పందించింది.అలాగే స్వాతికి ఉన్న పక్కింటి అమ్మాయి ఇమేజ్ ఆమెకు మైనస్ అయినట్టు కూడా తెలిపింది స్వాతి.

ఆమె మాట్లాడుతూ.. “చాలా మంది అబ్బాయిలు ఒక అమ్మాయిని బుట్టలో వేసుకోవడానికి ‘పెళ్లి చేసుకుంటాను’ అనే పదాన్ని ఒక వేపన్ లా వాడతారు. నేను చాలా హోమ్లీగా కనిపించడం వల్ల, నాకు చాలా మంది పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజ్ చేసేవారు. కానీ వారి మాటల్లో నిజాయితీ లేదని నాకు తెలిసిపోయేది. అందుకే అలాంటి ఫేక్ ప్రపోజల్స్‌కు సున్నితంగా తిరస్కరించేదాన్ని. చాలా పెళ్లిళ్లలో హిపోక్రసీ కనిపిస్తుంది. బయటకి భార్యాభర్తల్లా ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు చేతులు పట్టుకుని కనిపిస్తారు.

కానీ అది కేవలం సొసైటీ కోసమే.వెనుక సీన్ వేరే ఉంటుంది. ఒకరి పక్కన ఒకరు ఉంటూనే.. మరొకరికి సీక్రెట్ గా మెసేజ్లు పంపుకుంటూ ఉంటారు.ఇలాంటివి చూశాక పెళ్ళంటే వైరాగ్యం కలిగిందని, పెళ్లి చేసుకోవడం కన్నా ఒక కుక్కను పెంచుకుని, నా తల్లిదండ్రులకి అవసరమైనంత కాలం వారిని చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నా తల్లిదండ్రులు రివర్స్ సైకాలజీ వాడి ‘మీరు సంతోషంగా ఉండాలని మాకు లేదా?’ అని అనడంతో, పెళ్లి సంబంధాలు చూడటానికి వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.

ప్రేమ వివాహాలపై నాకు ఓపిక లేదు, ఏదైనా తప్పు జరిగితే నేనే అనుభవించాల్సి ఉంటుంది. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళకి చెప్పుకోవడానికి ఉంటుంది. మంచి అబ్బాయి దొరికితే అదృష్టం, కానీ ఎక్కువ శాతం అబద్దాలు చెప్పేవాళ్ళు, సైకోలే ఉన్నారు. అలాంటి వాళ్ళతో పనిచేసిన అనుభవం కూడా నాకు ఉంది. అయితే మా చిన్నాన్న, నాన్న వంటి వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ ని బాగా లీడ్ చేశారు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu