Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

FilmyFocus 2 days ago

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కుమార్తె త్రిషాల దత్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన భావోద్వేగ విషయాలను పంచుకోవడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న బాడీ షేమింగ్, మానసిక ఒత్తిడి, ఒంటరితనం గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు నెటిజన్స్‌ను ఆలోచింపజేస్తున్నాయి.

Trishala Dutt

ప్రస్తుతం అమెరికాలో సైకోథెరపిస్ట్‌గా పనిచేస్తున్న త్రిషాల, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్న వయసులోనే తన రూపం కారణంగా చాలాసార్లు ఎగతాళికి గురయ్యానని వెల్లడించారు. ముఖ్యంగా విదేశాల్లో పెరిగిన సమయంలో "భారతీయురాలు" అన్న కారణంతో కూడా కొంతమంది తనను టార్గెట్ చేశారని తెలిపారు. త్రిషాల జీవితంలో అతిపెద్ద విషాదం తన తల్లి రిచా శర్మ మరణమని ఆమె గుర్తుచేసుకున్నారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోవడం, తండ్రి షూటింగ్స్ కారణంగా తరచూ దూరంగా ఉండటం వల్ల తీవ్ర ఒంటరితనంలోకి వెళ్లిపోయానని చెప్పారు. ఆ బాధ నుంచి బయటపడేందుకు ఎక్కువగా తినడం అలవాటై, తరువాత బరువు పెరగడం వల్ల మరింత విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపారు.

ముఖ్యంగా "స్టార్ హీరో కూతురు అంటే ఇలా ఉండాలి" అనే సమాజపు అంచనాలు తనపై తీవ్ర ఒత్తిడిని సృష్టించాయని త్రిషాల పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తన రూపంపై వచ్చిన కామెంట్లు, బాడీ షేమింగ్ తనను తీవ్రంగా బాధించాయని కూడా వెల్లడించారు. అయితే ఆ అనుభవాలే ఇప్పుడు తనను మానసికంగా బలంగా మార్చాయని త్రిషాల చెప్పారు. జీవితంలో ఎదురైన బాధల కారణంగానే ఇతరుల మానసిక సమస్యలను అర్థం చేసుకుని వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో సైకోథెరపిస్ట్‌గా మారానని తెలిపారు.

ప్రస్తుతం త్రిషాల చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీ కుటుంబాల్లో పుట్టిన వారికీ ఇలాంటి మానసిక ఒత్తిళ్లు తప్పవని, బాడీ షేమింగ్ ఎంత ప్రమాదకరమో ఆమె మాటలు మరోసారి గుర్తు చేస్తున్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu