Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

FilmyFocus 3 weeks ago

మొన్నీమధ్య వరకు తమిళనాడు రాజకీయాలు విజయ్‌ చుట్టూ తిరిగితే.. ఇప్పుడు విజయ్‌ వదిలేసిన శాసనసభ స్థానం చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ పోటీ చేసిన పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌ స్థానాల్లో ఘన విజయం సాధించాడు.

అయితే రెండింటిలో ఒకటే అట్టిపెట్టుకోవాల్సి ఉండటంతో.. తిరుచ్చి స్థానాన్ని వదులుకున్నారు. అప్పటి నుండి తిరుచ్చి ఎన్నిక కూడా టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మారిపోయింది. విజయ్‌ స్థానంలో టీవీకే నుంచి పోటీ చేసేది ఎవరు అనేదే ఆ చర్చ మెయిన్‌ పాయింట్‌.

TVK

తిరుచ్చి అసెంబ్లీ స్థానం గురించి తొలుత ప్రముఖ దర్శకుడు, నటుడు, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ లారెన్స్‌ మాస్టర్‌ పేరు బాగా వినిపించింది. ఆయన కూడా పోటీకి సుముఖత వ్యక్తం చేసినట్లు కనిపించింది. అయితే అనూహ్యంగా 'నేను తిరుచ్చి కాకుండా ఇంకెక్కడి నుండైనా పోటీ చేస్తా' అని ప్రకటించేశారు. దీంతో నెక్స్ట్ ఎవరు అనే చర్చ తమిళనాడు వర్గాల్లో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం అయితే ఆ స్థానంలో నుంచి పోటీ చేసేది ఓ సినిమా వ్యక్తే అని అంటున్నారు.

గత కొన్ని రోజులుగా తమిళ సినిమా పరిశ్రమలో వినిపిస్తున్న పేరు ప్రముఖ కథానాయిక త్రిష. విజయ్‌కి సన్నిహితురాలిగా పేరున్న త్రిష.. తిరుచ్చి నుండి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లాలని ఆమె అభిమానులు, విజయ్‌ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఆమె ఈ విషయంలో సుముఖంగా లేరని టాక్‌. అలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్లినట్లు అవుతుందని ఆమె అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటి గౌతమి పేరు వినిపిస్తోంది.

కొన్ని నెలల క్రితం అన్నాడీఎంకేలో చేరిన గౌతమి.. ఇటీవల రాజీనామా చేశారు. టీవీకే తరఫున తిరుచ్చి నుండి పోటీ చేయడానికే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారనిటా మరో టాక్‌. ఇదిలా ఉండగా ఆ స్థానం నుండి ఓ సామాన్యుడితో పోటీ చేయించాలని విజయ్‌ అనుకుంటున్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu