Thursday, 15 Apr, 1.42 am FilmyFocus

హోమ్
Vakeel Saab Collections: ఉగాది సెలవుని బాగా క్యాష్ చేసుకున్నాడు..!

3 ఏళ్ళ తరువాత 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ నుండీ వచ్చిన చిత్రం 'వకీల్ సాబ్'.బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 'పింక్' కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసాడు. 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్ పై దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగెళ్ళ వంటి భామలు కూడా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్ లభించింది. దాంతో ఫస్ట్ వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకుంది.సోమవారం కొంచెం డౌన్ అయినట్టు కనిపించినప్పటికీ.. మంగళవారం నాడు ఉగాది హాలిడేని బాగా క్యాష్ చేసుకున్నాడు 'వకీల్ సాబ్'.

ఇక ఈ చిత్రం 5 రోజుల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :

నైజాం 20.46 cr
సీడెడ్ 10.74 cr
ఉత్తరాంధ్ర 9.78 cr
ఈస్ట్ 5.47 cr
వెస్ట్ 6.16 cr
గుంటూరు 6.18 cr
కృష్ణా 4.17 cr
నెల్లూరు 2.91 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 65.86 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.48 cr
ఓవర్సీస్ 3.61 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 72.95 cr

వకీల్ సాబ్' చిత్రానికి 89.85కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 90.5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాలి.5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 72.95 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 17.55 కోట్ల షేర్ ను రాబట్టాలి. పోటీగా సినిమాలు ఏమీ లేవు కాబట్టి.. అది పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి.

Click Here To Read Movie Review

'వకీల్ సాబ్ ' నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu
Top