Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన 'వీరభద్రుడు'.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన 'వీరభద్రుడు'.. మెంటల్ మాస్ ఇది

FilmyFocus 5 days ago

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా సూర్యకి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కొన్నాళ్ల నుండి సూర్యకి సరైన హిట్టు పడలేదు.

ఇటీవల సూర్య నుండి వచ్చిన సినిమాలు అన్నీ డిజప్పాయింట్ చేశాయి.

Veerabhadrudu

‘ఆకాశం నీ హద్దురా’ ‘జై భీమ్’ వంటి ఓటీటీ హిట్లు మినహా.. తర్వాత థియేటర్లలో రిలీజ్ అయిన ‘ఈటి’ ‘కంగువా’ ‘రెట్రో’ వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్స్ అయ్యాయి.

అయినప్పటికీ సూర్య క్రేజ్ కానీ, మార్కెట్ ఏమీ తగ్గలేదు.అతని లేటెస్ట్ మూవీ ‘వీరభద్రుడు'(Veerabhadrudu) మే 15న రిలీజ్ అయ్యింది. ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ మొదటి రోజు పర్వాలేదు అనిపించే రిపోర్ట్స్ ను అందుకుంది ఈ సినిమా. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. 4 రోజులకే ఈ సినిమా 90 శాతం పైనే రికవరీ సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం3.75 cr
సీడెడ్0.53 cr
ఆంధ్ర(టోటల్)3.12 cr
ఏపీ +తెలంగాణ(టోటల్)7.4 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్)0.33 cr
వరల్డ్ వైడ్ టోటల్7.73 cr(షేర్)

‘వీరభద్రుడు’ తెలుగు వెర్షన్ కి రూ.7.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.7.73 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.14.75 కోట్లు కొల్లగొట్టింది. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’ చిత్రం బయ్యర్స్ కి రూ.0.23 కోట్లు ప్రాఫిట్స్ ను అందించింది. వీక్ డేస్ లో స్టెడీగా కలెక్ట్ చేసినా సరిపోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu