Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

FilmyFocus 1 week ago

రైన సినిమాలు లేక థియేటర్లు విలవిలలాడుతున్నాయి. ఇలాంటి టైంలో అందరి దృష్టి 'వీరభద్రుడు' పై పడింది. సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమాగా 'వీరభద్రుడు' వార్తల్లో నిలిచింది.

డబ్బింగ్ సినిమా అయినప్పటికీ… టాలీవుడ్ బాక్సాఫీస్ కి కూడా కొంత ఊరటనిచ్చే సినిమా అవుతుంది అని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ‘వీరభద్రుడు’ పై హోప్స్ పెట్టుకున్నారు. అయితే కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా మే 14న విడుదల కావాల్సిన ఈ సినిమా ఒక రోజు ఆలస్యంగా అంటే మే 15న(ఈరోజు) రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో…? తెలుసుకుందాం రండి:

Veerabhadrudu Movie Review

కథ: తమిళనాడుకి చెందిన మీను(అనఘ మాయ రావి), తన తండ్రితో(ఇంద్రన్స్) కలిసి హైదరాబాద్..కు వస్తుంది. ఆమె అనారోగ్యం పాలవ్వడంతో ఓ మేజర్ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్లో అయితే అమ్మిన నగలకి ఎక్కువ డబ్బులు వస్తాయని తెలిసి.. సర్జరీ కూడా అక్కడే చేయించుకోవచ్చు అని డిసైడ్ అవుతుంది. అయితే వీళ్ళు హైదరాబాద్లో ట్రైన్ దిగిన వెంటనే కొంతమంది దొంగలు వీరివద్ద నగలుకొట్టేస్తారు. దీంతో దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తారు. అయితే 60 సవరల నగలకి కేవలం 45 సవరల నగలు మాత్రమే రికవరీ అయ్యాయని పోలీసులు వారికి చెబుతారు. రికవరీ అయిన నగలు కూడా కోర్టులో స్వాధీనపరుచుకోవాలనే కండిషన్ పెడతారు. అందుకోసం బేబీ కృష్ణ(ఆర్ జె బాలాజీ) అనే క్రిమినల్ లాయర్ వివరాలు ఇచ్చి… అతని వద్దకి పంపుతారు. అయితే బేబీ కృష్ణ పెద్ద లంచగొండి లాయర్ అనే విషయం వారికి తెలీదు. తర్వాత ఆ కారణం ఈ కారణం చెప్పి.. వీరి నగల కేసుని వాయిదా చేస్తూ మీనుని, అతని తండ్రిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు బేబీ కృష్ణ.

అయితే సహనం కోల్పోయిన మీను తండ్రి కోర్టు ఆవరణంలో ఉన్న వీరభద్రుడు విగ్రహం వద్దకి వెళ్లి తనకి న్యాయం చేయమని పూజిస్తాడు. ఈ క్రమంలో వీరభద్రుడు(సూర్య) బేబీ కృష్ణని వధించేందుకు అతనికి ప్రత్యక్షమవుతాడు. అయితే అదే టైంలో బేబీ కృష్ణ.. వీరభద్రుడు ముందు తన క్రిమినల్ లాయర్ బుద్దిని ప్రదర్శిస్తాడు. ‘న్యాయం తీర్చాల్సిన దేవుడు నీతి తప్పి నన్ను చంపడం కరెక్ట్ కాదని.. అంత దయ ఉంటే ఒక మనిషిగా వచ్చి మీనుకి ఆమె తండ్రికి న్యాయం చేయమని.. అప్పుడు ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని’ సవాలు విసురుతాడు. అందుకు వీరభద్రుడు సూర్య అనే లాయర్ మాదిరి కోర్టుకు వచ్చి మీను కేసు టేకప్ చేస్తాడు? మరి తాను చెప్పినట్టుగా మీనుకి న్యాయం చేయగలిగాడా? ఇందుకు మరో లాయర్ ప్రీతి(త్రిష) చేసిన సాయం ఏంటి? చివరికి మీను జీవితం ఏమైంది? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: సూర్య ఈ సినిమాలో హీరో అని ప్రచారం చేశారు. పోస్టర్లపై సూర్యనే పెట్టి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమా చూసిన తర్వాత ప్రతి ప్రేక్షకుడు దీనిని చీటింగ్..లానే ఫీల్ అవుతాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో సూర్య పాత్ర ఎక్స్టెండెడ్ క్యామియోలా ఉంటుంది తప్ప ఫుల్ లెంగ్త్ హీరో పాత్ర కానే కాదు. త్రిష కూడా హీరోయిన్ అనడానికి లేదు.ఆమెది కూడా ఓ కీలక పాత్ర అంతే. సినిమాలో ఎక్కువ నిడివి కలిగి ఉన్నది ఆర్ జె బాలాజీ పాత్రే. తన డైరెక్షన్లో చేసిన సినిమా కాబట్టి.. ఎక్కువగా అతని పాత్రనే హైలెట్ చేసుకున్నాడు. నిడివితో పాటు ఎలివేషన్స్ కూడా ఎక్కువగానే ఉండేలా చూసుకున్నాడు. అసలు కథ మొదలయ్యేదే ఇంద్రన్స్, అనఘ పాత్రలతో. కానీ ఫస్ట్ హాఫ్ తర్వాత వాళ్ళ పాత్రల తాలూకా జ్ఞాపకాలు కూడా లేకుండా చేసేశాడు దర్శకుడు. ‘మహారాజ’ తర్వాత నటరాజన్ సుబ్రహ్మణ్యంకి ఈ సినిమా ద్వారా మరో మంచి పాత్ర దొరికింది.

సాంకేతిక నిపుణుల పనితీరు: కథ వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దర్శకుడు ఆర్ జె బాలాజీ చాలా మంచి పాయింట్ ని తీసుకున్నాడు. ఈరోజుల్లో న్యాయవ్యవస్థ తీరు ఎలా ఉంది? పేదవాళ్ళ కేసులు కోర్టులో ఎందుకు పెండింగ్లో పడుంటున్నాయి? వంటి అంశాలతో పాటు పోలీసుల పనితీరుని ఎత్తి చూపిన విధానం సహజంగా అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలో కోర్టులో టీ అమ్ముకునే ఓ వ్యక్తి పాత్ర ఉంటుంది. న్యాయం కోసం ఉన్నందంతా అమ్ముకుని చివరికి కోర్టులో టీ అమ్ముకుంటూ లాయర్లు ఇచ్చిన డబ్బుని తీసుకుంటూ జీవించే పాత్ర అది. దానితో గట్టి సెటైర్ విసిరాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్లో టచ్ చేసిన సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కదిలిస్తాయి. ఇంటర్వెల్ వద్ద వచ్చే ఫైట్ కూడా ఓకే. కానీ సెకండాఫ్ మాత్రం ట్రాక్ తప్పింది.

ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మీను అనే పాత్రతో కథ మొదలవుతుంది. కానీ ఆ పాత్ర తాలూకా పాయింట్ లేకుండా సెకండాఫ్ ని నడిపించాడు దర్శకుడు. అందువల్ల ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయ్యింది. అంతేకాదు సూర్య స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగా ఉండటం ఒక డిజప్పాయింట్మెంట్. కానీ క్లైమాక్స్ లో వచ్చే వీరభద్రుడు తాండవం బాగానే ఉంటుంది. టెక్నికల్ గా కూడా ఈ సినిమాలో లోపాలు ఉన్నాయి. మ్యూజిక్ బాగుంది. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా పూర్ గా ఉంది. కథంతా ఒకటి రెండు సెట్లలోనే చుట్టేశారు.

విశ్లేషణ: ‘వీరభద్రుడు’ అనే టైటిల్ ని బట్టి ఇదొక మాస్ అండ్ కమర్షియల్ డ్రామా అని ఆడియన్స్ ఆశపడతారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు బాలాజీ ‘సింగం’ లాంటి సినిమా ఇస్తున్నట్టు సూర్య ఫ్యాన్స్ కి హామీ ఇచ్చాడు. కానీ ఇది అతని గత చిత్రం ‘అమ్మోరు తల్లి’ కి చాలా దగ్గరగానే ఉంటుంది. సూర్య ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసే అంశం అదే. అయితే కామన్ ఆడియన్స్ కి అయితే ఓకే ఓకే అనే ఫీలింగ్ ఇస్తుంది.

ఫోకస్ పాయింట్: పూర్తిస్థాయిలో న్యాయం చేయలేని ‘వీరభద్రుడు’

రేటింగ్: 2.5/5

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu