Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన 'వీరభద్రుడు'

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన 'వీరభద్రుడు'

FilmyFocus 2 days ago

రుస పరాజయాలతో డీలా పడ్డ సూర్య.. మొత్తానికి ఓ బ్లాక్ బస్టర్ కొట్టి సూపర్ ఫామ్లోకి వచ్చాడు. అతను హీరోగా రూపొందిన 'వీరభద్రుడు' సినిమా ఇటీవల అంటే మే 15న విడుదలైంది.

Veerabhadrudu

ఈ సినిమాపై మొదటి నుండి అంచనాలు అయితే లేవు. పైగా ఏప్రిల్ 14న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆర్ధిక లావాదేవీల కారణంగా నిలిచిపోయింది. తర్వాత సూర్య రంగంలోకి దిగి ఇష్యూని సాల్వ్ చేసి రిలీజ్ కి క్లియరెన్స్ తెప్పించారు.

అయితే ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ ‘వీరభద్రుడు'(Veerabhadrudu) సినిమా కొంత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. 4 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా వీక్ డేస్ మొత్తం మంచి వసూళ్ళు రాబట్టింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే

నైజాం5.12 cr
సీడెడ్0.68 cr
ఆంధ్ర(టోటల్)4.37 cr
ఏపీ +తెలంగాణ(టోటల్)10.17 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్)0.45 cr
వరల్డ్ వైడ్ టోటల్10.62 cr(షేర్)

‘వీరభద్రుడు’ తెలుగు వెర్షన్ కి రూ.7.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.10.62 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.19.95 కోట్లు కొల్లగొట్టింది. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా స్ట్రాంగ్ గా కలెక్ట్ చేసింది. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా కనిపిస్తుంది. ఇప్పటివరకు బయ్యర్స్ కి రూ.3.12 కోట్ల లాభాలు అందించింది ఈ చిత్రం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu