Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

FilmyFocus 1 week ago

రంగస్థలం ఓ దిగ్గజ దర్శకురాలిని కోల్పోయింది. కొన్ని దశాబ్దాలపాటు రంగస్థంలో ఆ తర్వాత సినిమా రంగంలో తన సత్తా చాటి ప్రముఖ మరాఠీ రంగస్థల దర్శకురాలు, నటి విజయ మెహతా (91) ఇటీవల కన్నుమూశారు.

గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తన నివాసంలో తుదిశ్వాస విడిచారని ఆమె సన్నిహితులు తెలిపారు. దీంతో రంగస్థల, చలనచిత్ర, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.

Vijaya Mehta

1934లో గుజరాత్‌లో జన్మించిన విజయ మెహతా ముంబయి కాలేజీలో చదువుతున్నప్పుడు 'ఒథెల్లో' అనే నాటకంలో నటించారు. అందులో ఆమె నటనను దిగ్గజ నాటక దర్శకుడు ఇబ్రహీం అల్కాజీ చూశారు. అప్పుడే ఆయన దృష్టిలో పడిన విజయ.. ఆ తర్వాత ఆమె చదువు పూర్తయ్యాక ఇబ్రహీం అల్కాజీ, ఆది మర్జ్‌బాన్‌ శిక్షణ పొందారు. కొన్నేళ్ల తర్వాత ప్రఖ్యాత నాటక రచయిత విజయ్‌ టెండుల్కర్, నటులు అరవింద్‌ దేశ్‌పాండే, శ్రీరామ్‌ లాగూతో కలసి ముంబయిలో 'రంగయన్‌' అనే నాటక సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

'కలియుగ్‌' అనే సినిమాతో నటిగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన విజయ.. 1984లో వచ్చిన 'పార్టీ' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. 1986లో వచ్చిన 'మెహతా రావు సాహెబ్‌', 1984లో వచ్చిన పెస్టోంజీ లాంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. చివరిగా 1991లో 'లైఫ్‌లైన్‌' టీవీ సిరీస్‌ని డైరెక్ట్‌ చేశారు. ఇక పురస్కారాల విషయానికొస్తే.. సంగీత నాటక అకాడమీ అవార్డు, సంగీత నాటక అకాడమీ ఠాగూర్‌ రత్న లాంటి అవార్డులను అందుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu