Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

FilmyFocus 1 week ago

త కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఏదైనా సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అంటే.. అది 'పంజా' గురించి మాత్రమే. రీరిలీజ్‌ సినిమాకు ఇంతగా ప్రచారం జరగడం పెద్ద విషయం కాదు.

ఎందుంకటే మన టాలీవుడ్‌లో ఈ పరిస్థితి గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఒకానొక సమయంలో ఫస్ట్‌ టైమ్‌ రిలీజ్‌ సినిమాల కంటే రీరిలీజ్‌ సినిమాలకే ఎక్కువ హైప్‌ కనిపించింది. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా 'పంజా' సినిమా మరోసారి రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో అలా చర్చ జరుగుతూనే ఉంది.

Vishnu Vardhan

ఇలాంటి సమయంలో ఓ పాత విషయం ఒకటి బయటకు వచ్చింది. అయితే బయటకు వచ్చింది అనే మాట కంటే ఎప్పుడో 16 ఏళ్ల క్రితం క్రితం జరిగిన ఓ విషయం గురించి క్లారిటీ వచ్చింది అని చెప్పాలి. 'పంజా' సినిమా అనౌన్స్‌ అయిన కొన్ని రోజులకే 'బిల్లా 2' సినిమాను అనౌన్స్‌ చేశారు. అయితే రెండు సినిమాల హీరోల డేట్స్‌ అడ్జెస్ట్ కాని కారణంగా రెండు సినిమా షూటింగ్‌లు ఒకేసారి చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో ముందుగా ఓకే చేసిన 'పంజా' సినిమాకే దర్శకుడు విష్ణువర్థన్‌ ఓకే చెప్పి 'బిల్లా 2' వదులుకున్నారు.

ఆ విషయం గురించి విష్ణు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు సినిమాలను ఒకేసారి షూటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పడు.. ఎంతో ఆలోచించి తొలుత ఓకే చేసిన 'పంజా' సినిమాకే నా ఓటు వేశాను. 'బిల్లా 2' నుండి తప్పుకున్నాను. ఆ సమయంలో ఆ నిర్ణయం కష్టమే అయినప్పటికీ తొలుత మాటిచ్చాను కాబట్టి 'పంజా' చేశాను అని చెప్పారు. దీంతో అప్పుడు ఆయన మైండ్‌లో ఏం జరిగిందో తెలిసింది.

అయితే, ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు దగ్గర ఇబ్బందికర ఫలితమే అందుకున్నాయి. 'బిల్లా' సినిమా తీసుకొచ్చిన వైబ్‌, మజాను 'బిల్లా 2' తీసుకురాలేకపోయింది. ఇక 'పంజా' స్టైలిస్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకున్నా వసూళ్లు అయితే అందుకోలేకపోయింది.

రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన 'ఇరుముడి'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu