Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

FilmyFocus 1 week ago

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ త్రివిక్రమ్ కి హోమ్ బ్యానర్ లాంటిది. దాని చైల్డ్ బ్యానర్ అయినటువంటి 'సితార ఎంటర్టైన్మెంట్స్' లో కూడా త్రివిక్రమ్ కి పార్ట్నర్ షిప్ ఉంది.

ఈ బ్యానర్ లో నిర్మాత నాగవంశీ ఏ సినిమా చేయాలనుకున్నా.. ముందుగా త్రివిక్రమ్ అప్రూవల్ తీసుకునే మొదలుపెడతారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక.. మొదట త్రివిక్రమ్ కే చూపిస్తారు నాగవంశీ. త్రివిక్రమ్ కి నచ్చితే .. ప్రమోషన్స్ కి వచ్చి సినిమాని పుష్ చేస్తారు. లేదు అంటే తన పేరుని ఎక్కడా వాడనివ్వరు త్రివిక్రమ్.

Vishwanath & Sons

మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా మాత్రం త్రివిక్రమ్ కి నచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా నాగవంశీ.. ఈరోజు నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పుకొచ్చారు. నాగ వంశీ మాట్లాడుతూ…" త్రివిక్రమ్ గారికి 4,5 రోజుల క్రితం 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా చూపించాం. సినిమా చూసిన తర్వాత ఆయన చాలా బాగా నచ్చింది అన్నారు. నేను చెబుతున్నా.. త్రివిక్రమ్ గారు నా బ్యానర్లో చేసిన సినిమాలు చూసి బాగుంది అని చెప్పిన సినిమా ఇప్పటివరకు ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు.

సినిమా చూసిన తర్వాత త్రివిక్రమ్ గారు.. ' మీరంతా మమితా బైజు బాగా చేసింది అంటున్నారు కానీ, నాకు సూర్య గారు తప్ప ఎవ్వరూ కనిపించడం లేదు ' అని అన్నారు. హీరో బాగా డబ్బులున్న క్యారెక్టర్ చేస్తే .. ఎలాంటి కిక్ వస్తుందో.. మనం అత్తారింటికి దారేది లో పవన్ కళ్యాణ్ గారి రోల్ తో ఎక్స్పీరియన్స్ చేశాం. విశ్వనాథ్ అండ్ సన్స్ లో కూడా హీరో పాత్రని అంత బాగా డిజైన్ చేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి " అంటూ నాగ వంశీ చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu