Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Yash: 'టాక్సిక్' సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: 'టాక్సిక్' సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

FilmyFocus 3 weeks ago

న్నడ స్టార్ హీరో యశ్(Yash) పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది 'కె జి ఎఫ్'(సిరీస్) అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ చిత్రాలు అద్భుత విజయం సాధించడంతో అతనికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.

పాన్ ఇండియా ఫాలోయింగ్ దక్కింది. ఈ కన్నడ స్టార్.. తన తర్వాతి సినిమా విషయంలో మాత్రం చాలా టైమ్ తీసుకుంటున్నాడు. గత కొన్నేళ్లుగా స్టార్ హీరోలు వరుస సినిమాలను ప్రకటిస్తున్నా, యష్ మాత్రం స్లో అండ్ స్టెడీ అన్నట్టు వ్యవహరిస్తున్నాడు.

Yash

'కె జి ఎఫ్ : చాప్టర్ 2' విడుదలైన తర్వాత యశ్‌కు చాలా కథలు, భారీ ప్రాజెక్ట్ ఆఫర్లు వచ్చినప్పటికీ.. వాటిలో చాలా వరకు పక్కన పెట్టినట్లు ఇండస్ట్రి టాక్. ప్రస్తుతం తన ఫోకస్ అంతా టాక్సిక్ (Toxic) సినిమాపైనే ఉంచాడు.ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 3 ఏళ్ళు కేటాయించాడు. మరి ఇది అతనికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.వాస్తవానికి టాక్సిక్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తూ వస్తున్నారు.

ఈ ప్రాజెక్టు విషయంలో యశ్ పార్ట్ ఫినిష్ అయ్యి చాలా కాలం అయ్యింది. మరి అతను నెక్స్ట్ ఏ ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకెళ్తాడు? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది. పలువురు దర్శకులు ఆయనకు కథలు చెప్పినా., ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ కూడా ఖరారు కాలేదని ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినపడుతున్నాయి. కొన్ని కథలను పరిశీలనలో ఉంచినప్పటికీ.. ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటన చేసే ఆలోచన లేదని సమాచారం.

టాక్సిక్ లో హీరోగా నటించడమే కాకుండా.. ఇప్పుడు క్రియేటివ్ అంశాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నట్టు సమాచారం. 'కె జి ఎఫ్' తెచ్చిపెట్టిన పాన్ ఇండియా మార్కెట్‌ను మరింత విస్తరించాలనే లక్ష్యంతో 'టాక్సిక్' ను జాగ్రత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యశ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో 'టాక్సిక్' రిలీజ్ అయ్యేవరకు యశ్ తన నెక్స్ట్ ప్రాజెక్టుని అనౌన్స్ చేసే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించడం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: FilmyFocus Telugu