మార్కెట్ ఇవాళ కూడా స్వల్ప నష్టాలతో ప్రారంభం కానుంది. గిఫ్ట్ నిఫ్టి 50 పాయింట్ల నష్టంతో ఉంది. ఒక అడుగు ముందుకు, రెండు అడగులు వెనక్కి వేస్తున్న నిఫ్టి… ఇవాళ అటు కాల్స్‌ను, పుట్స్‌ను తినేసే పనిలోఉంది.
నిన్నటి నష్టాలతో దాదాపు 24400 కాల్స్ మొత్తం నీరుగారి పోయాయి. ఆపైన ఉన్న స్ట్రయిక్స్ కూడా అయిదు పైసలకు పడ్డాయి. ఇక పుట్స్ పరిమాణం చాలా తక్కువే. నిన్న కూడా పీసీఆర్ 0.7 కన్నా తక్కువే ఉంది. ఒకవేళ నిఫ్టి తగ్గినా… విదేశీ ఇన్వెస్టర్లకు పెద్ద భారం కాదు. వాటిని కూడా దెబ్బతీయాలంటే… నిఫ్టిని గ్రీన్‌లోకి తీసుకెళ్ళడమే. మరి విదేశీ ఇన్వెస్టర్లు ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే ఇవాళ నిఫ్టి మంత్లితోపాటు వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంటుంది. 3.15 నుంచి స్టాక్ మార్కెట్ ఓ గాంగ్లింగ్ సెంటర్‌గా మారనుంది. ఇప్పటికే చాలా మంది చిన్న ఇన్వెస్టర్లు డే ట్రేడింగ్‌కు దూరమయ్యారు. దీంతో ఇపుడు ఈ CAS క్లోజింగ్ ఆట పెద్దల వ్యవహారంగా మారింది.
ఇక షేర్ల విషయానికొస్తే మ్యాక్స్ కౌంటర్లను గమనించాల్సి ఉంటుంది. కంపెనీల వల్ల రూ. 3,915 కోట్ల నష్టం కల్గిందనే కేసులో మ్యాక్స్, యాక్సిస్ కంపెనీలకు క్లీన్‌చిట్ లభించింది. మరి ఈ కంపెనీ షేర్లు ఎలా ట్రేడవుతాయో చూడాలి. ఇవాళ ఐటీ షేర్లకు మంచి మద్దతు లభించవచ్చు. ద్వితీయ శ్రేణి ఐటీ షేర్లకు బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ ఇవాళ గట్టి పుష్ ఇచ్చింది. టీసీఎస్‌కు కూడా రూ.14,000 కోట్ల పోర్షే ఏజీ కాంట్రాక్ట్ లభించింది. దీంతో మొత్తానికి ఐటీ గ్రీన్‌లో ఉండనుంది. ఇక మెటల్ షేర్లలో ర్యాలీ ఇవాళ కూడా కొనసాగనుంది. నాల్కో, హిందాల్కో, JSW స్టీల్ వంటి షేర్లకు మద్దతు లభించవచ్చు. గోల్డ్ మూడు నెలల గరిష్ఠానికి చేరడం విశేషం. ఇక ఏపీలో రూ. 10,000 కోట్ల సుజ్లాన్ పవన విద్యుత్ ప్రాజెక్ట్‌ను ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. దీని ప్రభావం ఈ షేర్‌పై ఉంటుందేమో చూడాలి. ఇక HIV డ్రగ్ నాలుగో దశ ట్రయల్స్‌కు డాక్టర్ రెడ్డీస్, ఎంక్యూర్‌ల ఫార్మాలకు అనుమతి లభించింది. ఈ షేర్లు ఇవాళ వెలుగులో ఉండే అవకాశముంది. గోధుమలు, గోధుమ ఉత్పత్తుల ఎగుమతిపై ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. దీని ప్రభావం LT foods షేర్‌పై సానుకూలంగా ఉండే అవకాశముంది.

