Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫెడ్‌ బ్యాంక్‌ చేతికి జనా SFB

ఫెడ్‌ బ్యాంక్‌ చేతికి జనా SFB

For Money 10 hrs ago

నా స్మాల్ ఫైనాన్స్‌ బ్యాంక్‌ను టేకోవర్‌ చేసేందుకు ఫెడరల్‌ బ్యాంక్‌ సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జనా SFBలో ప్రమోటర్లకు ఉన్న వాటా కొనేందుకు ఫెడరల్‌ బ్యాంక్‌ చర్చలు జరుపుతోంది.

నిధుల సమస్యను ఎదుర్కొంటున్న జనా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ప్రమోటర్‌ జనా హోల్డింగ్‌ తన వాటా అమ్మేందుకు రెడీ అవుతోంది. జనా SFBలో ప్రమోటర్‌ కంపెనీకి 16.9 శాతం వాటా ఉంది. ఈ వాటాను ఫెడరల్‌ బ్యాంక్‌ కొనే పక్షంలో జనా SFB వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ చేయాల్సి ఉంటుంది. గత కొన్ని నెలల నుంచి విస్తరణ కోసం ఫెడరల్‌ బ్యాంక్‌ ప్రయత్నిస్తోంది.

ఫెడరల్‌ బ్యాంక్‌ చాలా వరకు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో భారీగా విస్తరిచింది. ఏపీ, తెలంగాణలో ఇపుడిపుడే విస్తరిస్తోంది. అయితే మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్‌తో పాటు కర్ణాటకలో విస్తరించి ఉన్న జనా SFB టేకోవర్‌ చేస్తే తన విస్తరణ సులభం అవుతుందని ఫెడరల్‌ బ్యాంక్‌ భావిస్తోంది. ఫెడరల్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ విలువ రూ.

3.93 లక్షల కోట్లు కాగా, జనా SFB బ్యాలెన్స్‌ షీట్‌ విలువ రూ. 46,812 కోట్లు. అలాగే ఫెడరల్‌ బ్యాంక్‌కు 1650 శాఖలు ఉండగా, జనా SFBకు 826 శాఖలు ఉన్నాయి. జనా SFB నికర వడ్డీ మార్జిన్‌ 7.5 శాతం కాగా, ఫెడరల్‌ బ్యాంక్‌ నికర వడ్డీ మార్జిన్‌ 3.33 శాతం. పలు విషయాల్లో ఈ టేకోవర్‌ ఫెడరల్‌ బ్యాంక్‌కు కలిసి వస్తుందని బ్యాంకింగ్‌ నిపుణులు భావిస్తున్నారు.

అయితే మార్కెట్‌ ఫెడరల్ బ్యాంక్‌ షేర్‌ ఇవాళ భారీగా క్షీణించింది. ఒకదశలో 4 శాతం క్షీణించి రూ. 342 తాకగా, ఇపుడు రూ. 347 వద్ద ట్రేడవుతోంది. జనా SFB బ్యాంక్‌ షేర్‌ 2 శాతం దాకా నష్టపోయి రూ. 570ని తాకింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: For Money