Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్‌ జీసీసీ

హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్‌ జీసీసీ

For Money 3 days ago

దేశంలోనే అతి పెద్ద డేటా సెంటర్‌ను ఆకర్షించిన హైదరాబాద్‌కు మరో భారీ ప్రాజెక్టు రానుంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిబులిటీ సెంటర్‌ను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది.

అమెరికాకు చెందిన అతిపెద్ద ఆర్థిక సేవల కంపెనీలలో ఒకటైన ట్రూయిస్ట్‌తో కలిసి ఈ జీసీసీని ఏర్పాటు చేయనుంది. అయితే ఈ ప్రాజెక్టు విలువ గురించి కంపెనీ ఎలాంటి కామెంట్‌ చేయలేదు. తమ క్లయింట్లకు మెరుగైన సేవలు అందిచడంతో పాటు డిజిటల్ ఆధారిత, డిజిటల్‌ సంబంధ బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు ఈ జీసీసీ సాయపడుతుందని ఇన్ఫోసిస్‌ పేర్కొంది. AI, టెక్నాలజీ, డేటాతో పాటు ఇతర కార్యకలాపాలను ఒకే డెలివరీ ఫ్రేమ్‌వర్క్‌గా తీసుకు వస్తున్నామని, ఇదొక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మారుతుందని తెలిపింది. దీనిల్ల థర్డ్-పార్టీపై ఆధారపడటం తగ్గుతుందని, గ్లోబల్ డెలివరీ వ్యవస్థ మెరుగుపర్చేందుకు హైదరాబాద్‌ జీసీసీ ఉపయోగపడుతుందని పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: For Money