Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇండియా కూటమికి ఆధిక్యం!

ఇండియా కూటమికి ఆధిక్యం!

For Money 3 weeks ago

ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ద నేషన్ ఇపుడు జాతీయ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సీ ఓటర్‌తో కలిసి ఈ ఛానల్‌ జరిపిన ఈ సర్వే వివరాలు దేశ రాజకీయ ముఖచిత్రంలో మార్పును సూచిస్తున్నాయి.

ఇప్పటికిపుడు ఎన్నికలు జరిపితే బీజేపీ కన్నా ఇండియా కూటమికి ఆధిక్యం వచ్చే అవకాశముంది. బీజేపీ 261స్థానాలకు పడిపోనుంది. ఆగస్టులో జరిగిన ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్‌ తన సీట్లను 106కు పెంచుకోగా, ఇతరుల సంఖ్య 176 వద్ద ఉంటోంది. అయితే బీజేపీ సీట్లు 287 నుంచి 261కి పడిపోనున్నాయి.

ఇక ఓట్ల శాతం విషయానికొస్తే బీజేపీ ఓట్ల శాతం 41 నుంచి 39 శాతానికి పడిపోనుంది. కాంగ్రెస్‌ ఓట్ల శాతం 20 నుంచి 21 శాతానికి పెరగ్గా, ఇతర పార్టీల ఓట్ల శాతం 39 నుంచి 40కి పెరగనుంది. యూపీలో బీజేపీకి 38 సీట్లు వస్తాయని, ఇండియా కూటమికి 41 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లలో బీజేపీకి ఆధిక్యం ఉండగా… పంజాబ్‌ మాత్రం ఆప్‌కు ఆధిక్యం లభిస్తుందని సర్వేలో తేలింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: For Money