Dailyhunt
ఇరాన్‌ను నేలమట్టం చేస్తాం

ఇరాన్‌ను నేలమట్టం చేస్తాం

For Money 3 weeks ago

మెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఇరాన్‌ను హెచ్చరించారు. రేపు తెల్లవారుజాములోగా హర్ముజ్‌ జలసంధిని ఓపెన్‌ చేయాలని ఇరాన్‌ను ఆయన హెచ్చరించారు.

లేదంటే ఇరాన్‌ను నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఆయన విధించిన డెడ్‌లైన్ భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 5.30 గంటలకు ముగుస్తుంది. ఈలోగా హర్మూజ్‌ను తెరవకపోతే ఇరాన్‌లో వంతెనలు, విద్యుత్కేంద్రాలను నేలమట్టం చేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. తాము తల్చుకుంటే అంతకుముందే దాడులు చేస్తామన్నారు.

ఇరాన్‌ మాత్రం ట్రంప్‌ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. పైగా తను పది అంశాలతో కూడా ప్రతిపాదనను ముందు పెట్టింది. యుద్ధం శాశ్వత ముగింపునే తాము కోరుకుంటున్నట్లు ఇరాన్‌ వెల్లడించింది. ఈ యుద్ధంలో జరిగిన నష్టాన్ని అమెరికా భర్తీ చేయాల్సిందేనని పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: For Money