Dailyhunt
జెట్‌ స్పీడుతో సూచీలు

జెట్‌ స్పీడుతో సూచీలు

For Money 1 week ago

మెరికా, ఇరాన్‌లు యుద్ధ విరమణ ప్రకటన చేయగానే ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు దూసుకెళుతున్నాయి. రెండు శాతంపైగా లాభంతో అమెరికా ఫ్యూచర్స్‌ ట్రేడవుతున్నాయి.

నిన్న రాత్రి వాల్‌స్ట్రీట్‌ స్థిరంగా ముగిసింది. ఇపుడు 1000 పాయింట్లకు పైగా లాభంతో డౌజోన్స్‌ ట్రేడవుతోంది. మరోవైపు ఆసియా మార్కెట్లలోనూ రెట్టించిన జోష్‌ కన్పిస్తోంది. జపాన్‌ మార్కెట్లు అయిదు శాతంపైగా లాభంతో ఉన్నాయి.

గిఫ్ట్‌ నిఫ్టి ఇపుడు మూడు శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో దీర్ఘ కాలిక ర్యాలీ ప్రారంభమౌతుందేమో చూడాలి. ఇటీవల బాగా తగ్గిన షేర్లకు ఇపుడు మంచి డిమాండ్‌ లభించే అవకాశముంది. ముఖ్యంగా ఎల్‌ అండ్‌ టీ వంటి క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు, ఓఎంసీల షేర్లకు చక్కటి డిమాండ్‌ వచ్చే అవకాశముంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: For Money