Dailyhunt
మళ్ళీ 'హర్ముజ్‌' టెన్షన్‌

మళ్ళీ 'హర్ముజ్‌' టెన్షన్‌

For Money 5 days ago

మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టి మళ్ళీ 24000 స్థాయిని టెస్ట్‌ చేస్తోంది. ఫలితాలకు ఆయా కంపెనీల షేర్లు స్పందిస్తున్నాయి. రిజల్ట్స్‌ బాగున్న టాటా టెక్నాలజీస్, ఐడియా ఫోర్జ్‌ వంటి షేర్లు గ్రీన్‌లో ఉండగా, మణ్ణపురం ఫైనాన్స్‌ నష్టాల్లో ఉన్నాయి.

నిన్న ఫలితాలు ప్రకటించిన ఏబీ క్యాపిటల్‌ కూడా ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతోంది. నిఫ్టి ప్రస్తుతం 100 పాయింట్ల నష్టంతో ఉంది. ఇవాళ నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడంతో తదుపరి మార్కెట్‌లో ఒత్తిడి వస్తుందా లేదా షార్ట్‌ కవరింగ్‌ వస్తుందా అన్నది చూడాలి. మరోవైపు వోడాఫోన్‌ షేర్‌ కూడా ఇవాళ లాభాల్లో ట్రేడవుతోంది.

రూ. 11 స్థాయిని టెస్ట్‌ చేస్తోంది. రూ.11- రూ. 11.50 మధ్య ఈ షేర్‌పై ఒత్తిడి వస్తోంది. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, అదానీ ఎంటర్‌టైన్‌మెంట్‌, టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ టాప్‌లో ఉన్నాయి. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఎల్‌ అండ్‌ టీ, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: For Money