Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రివకరీలో రికార్డు

రివకరీలో రికార్డు

For Money 3 weeks ago

ఎంత వేగంగా పడ్డాయో… అంతే వేగంగా పెరిగాయి చిప్‌ కంపెనీల షేర్లు. రాత్రి వాల్‌స్ట్రీట్‌లో చిప్‌ కంపెనీల షేర్లకు గట్టి మద్దతు లభించింది. దిగువస్థాయిలో వచ్చిన కొనుగోళ్ళకారణంగా పలు కంపెనీలు భారీ లాభాలతో ముగిశాయి.

స్కాన్‌డిస్క్ 26 % లాభంతో పెరగ్గా, ఇటీవల వాల్‌స్ట్రీట్‌లో లిస్టయిన SK Hynix 22% పెరిగింది. ఇక మైక్రాన్‌ లాభాలు 18 శాతంపైనే ఉన్నాయి. మరోవైపు ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించిన మైక్రోసాఫ్ట్‌ కూడా 16 శాతం పరిగింది. చిప్‌ కంపెనీలు ఇచ్చిన జోష్‌తో నాస్డాక్‌ సూచీ రాత్రి 2.78 శాతం పెరిగింది. మరోవైపు ఆదిదాస్‌, మాస్టర్‌ కార్డ్‌, ఎయిర్‌బస్‌ భారీ లాభాలు ప్రకటించాయి. బీఎండబ్ల్యూ లాభాలు 35 శాతం తగ్గడం విశేషాలు. ఇక అమెజాన్‌ ప్రకటించిన అద్భుత ఫలితాల కారణంగా అమెరికా ఫ్యూచర్స్‌ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక కోప్సీ అదరగొట్టింది. ఇపుడు 16 శాతం లాభంతో ట్రేడవుతోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ఐటీ షేర్లలో నిన్న రాత్రి లాభాల స్వీకరణ కన్పించింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 5 శాతంపైగా నష్టపోయింది. అయితే విప్ఓ ఏడీఆర్‌ మాత్రం
2 శాతం లాభపడింది. ఇక 100లోపునకు డాలర్‌ ఇండెక్స్‌ పడింది. అయితే క్రూడ్‌ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 88 డాలర్లపైనే ట్రేడవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: For Money