అంతర్జాతీయ మార్కెట్లలో ముఖ్యంగా అగ్రదేశాల్లో బాండ్ ఈల్డ్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. పైగా ఇవాళ బ్రెంట్ క్రూడ్ 94 డాలర్లు పెరగడంతో వాల్‌స్ట్రీట్ నష్టాలతో ప్రారంభమైంది.
క్రూడ్ ధరలు ఏకంగా 6 శాతంపైగా పెరగడంతో ఎకనామీ షేర్లపై ఒత్తిడి పెరిగింది. అలాగే ఐటీ షేర్లలో వచ్చిన అమ్మకాల కారణంగా నాస్‌డాక్ 0.8 శాతంపైగా నష్టపోయింది. చాలా వరకు ఏఐ షేర్లు నిలకడగా ఉన్నాయి. అయితే డౌజోన్స్‌తో 0.82 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.62 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. బాండ్ ఈల్డ్స్ దెబ్బకు మార్కెట్‌లో ఒత్తిడి పెరుగుతోంది.
డాలర్ ఇండెక్స్ కూడా 100 వైపు పరుగులు పెడుతోంది. డాలర్ పెరగడంతో బులియన్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. వెండి, బంగారం రెండు శాతంపైగా నష్టపోయాయి. ఔన్స్ బంగారం ధర మళ్ళీ 4400 డాలర్ల దిగువకు పడిపోయింది.

