Dailyhunt
Gangadr Gangadhr 4 years ago
94వ వార్షిక మహాసభలు ప్రారంభం

తూర్పుగోదావరి జిల్లా ....పిఠాపురం.... శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మి క పీఠంనూతన ఆశ్రమ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే పీఠం 94 వ వార్షిక మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి . పీఠాధిపతి ఉమర్ ఆలీషా జ్యోతి ప్రజ్వలన లతో సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమర్ఆలీష మాట్లాడుతూ మానవుడు తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా జ్ఞాన నేత్రాన్ని పొందగలుగుతాడు అని తెలిపారు . తాత్విక జ్ఞాన నేత్రంద్వారా మాత్రమే తనలో నిండిఉన్న భగవంతుడిని దర్శించుకోగలడని వెల్లడించారు . మానవత్వపు విలువలు కోల్పోవడం వలన రాక్షసత్వం ఏర్పడుతుందని తాత్త్విక జ్ఞానం మానవుడిని భిన్నత్వం నుండి ఏకత్వం వైపు పయనింప చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు , పీఠంమీడియా కన్వీనర్ ఆకుల రవి తేజ తదితరులు పాల్గొన్నారు.
Dailyhunt
Disclaimer: This content has been published by the user directly on Dailyhunt, an intermediary platform. Dailyhunt has neither reviewed nor has knowledge of such content. Publisher: Gangadr Gangadhr