రాష్ట్రవ్యాప్తంగా మే 20న మెడికల్ షాపుల బంద్‌కు ఫార్మసీ అసోసియేషన్ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫార్మసీ అసోసియేషన్ ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది.
కోవిడ్ సమయంలో ఇచ్చిన సడలింపులను అడ్డంగా పెట్టుకుని ఆన్లైన్ మెడిసిన్ దందా పెరిగిందని ఆరోపణలు వచ్చాయి.
ఆన్లైన్ ద్వారా నకిలీ మందులు, గడువు ముగిసిన మందులు సరఫరా అవుతున్నాయని ఫార్మసిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రమాదకర మందులు విక్రయం జరుగుతుందంటూ మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఈ-ఫార్మసీ వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆన్లైన్ మందుల వల్ల మోసపోతున్న ప్రజలు అంటూ అసోసియేషన్ వ్యాఖ్యానించింది.చిన్న మెడికల్ షాపులు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ రంగంలో వేలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయని హెచ్చరిక జారీ చేశారు. ఆన్లైన్ ఫార్మసీ సేవలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ లో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మే 20 బంద్‌కు అన్ని జిల్లాల మెడికల్ షాపులు సహకరించాలని పిలుపునివ్వగా అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉండే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా మే 20న మెడికల్ షాపుల బంద్‌కు ఫార్మసీ అసోసియేషన్ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫార్మసీ అసోసియేషన్ ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. కోవిడ్ సమయంలో ఇచ్చిన సడలింపులను అడ్డంగా పెట్టుకుని ఆన్లైన్ మెడిసిన్ దందా పెరిగిందని ఆరోపణలు వచ్చాయి.

