Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అద్దంకి, సామాకు హరీశ్ లీగల్ నోటీసులు

అద్దంకి, సామాకు హరీశ్ లీగల్ నోటీసులు

కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు బీఆర్ఎస్ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు లీగల్ నోటీసులు జారీ చేశారు.

తనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో తన ప్రతిష్టను దిగజార్చేలా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఈ చర్య తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, తీవ్ర కరువు రావాలని కోరుకుంటూ ఎమ్మెల్యే హరీశ్ రావు పలు దేవాలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారంటూ అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

తనపై చేసిన ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన హరీశ్ రావు, రాజకీయం కోసం తనపై ఇలాంటి అసత్య, దుర్మార్గపు ప్రచారాలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన తప్పుడు వ్యాఖ్యలకు గాను అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలు తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు.

ఒకవేళ నిబంధనల ప్రకారం క్షమాపణలు చెప్పకపోతే వారిపై చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కోర్టు మెట్లు ఎక్కుతామని హరీశ్ రావు స్పష్టం చేశారు.రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సహించరానిదని ఇలాంటి దుష్ప్రచారాలను చట్టపరంగా ఎదుర్కొంటానని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు బీఆర్ఎస్ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు లీగల్ నోటీసులు జారీ చేశారు. తనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో తన ప్రతిష్టను దిగజార్చేలా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఈ చర్య తీసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu