Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AIపై ట్రంప్ కీలక నిర్ణయం!

AIపై ట్రంప్ కీలక నిర్ణయం!

ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత దూసుకుపోతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మార్కెట్లోకి వచ్చే అత్యంత అధునాతన AI మోడల్స్ (Advanced AI Models) మార్కెట్‌లోకి విడుదల కావడానికి ముందే వాటిపై ప్రభుత్వ సమీక్ష తప్పనిసరి చేస్తూ వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయడానికి సిద్ధమైంది.

జాతీయ భద్రత, సైబర్ సెక్యూరిటీ మరియు ప్రజల గోప్యతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూడటమే ఈ సరికొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశ్యం. ప్రస్తుతం ఓపెన్AI, గూగుల్, మెటా వంటి దిగ్గజ సంస్థలు అత్యంత శక్తివంతమైన AI మోడళ్లను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే, వీటి వల్ల భవిష్యత్తులో తలెత్తే ముప్పులను అంచనా వేసేందుకు ఒక పటిష్టమైన వ్యవస్థ ఉండాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.

ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం..కంపెనీలు తమ అధునాతన AI మోడళ్లను అధికారికంగా లాంచ్ చేయడానికి ముందే ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.ప్రభుత్వ నిపుణుల కమిటీ ఆయా మోడళ్లలోని భద్రతా ప్రమాణాలను మరియు వాటి వల్ల జరిగే మేలు కీళ్లను సమీక్షిస్తుంది.ఈ సమీక్షలో గ్రీన్ సిగ్నల్ లభిస్తేనే ఆయా మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి అనుమతి లభిస్తుంది.

సాంకేతిక పరిజ్ఞానం సమాజానికి మేలు చేయాలి, కానీ అది నియంత్రణ లేని ముప్పుగా మారకూడదు. అందుకే విడుదలకు ముందే భద్రతా తనిఖీలు ముఖ్యం అని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నిర్ణయం పెద్ద పెద్ద టెక్ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నిబంధనల వల్ల కొత్త ఆవిష్కరణల వేగం తగ్గుతుందని కొందరు వాదిస్తుండగా, భద్రత పరంగా ఇది చాలా అవసరమైన చర్య అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత దూసుకుపోతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మార్కెట్లోకి వచ్చే అత్యంత అధునాతన AI మోడల్స్ (Advanced AI Models) మార్కెట్‌లోకి విడుదల కావడానికి ముందే వాటిపై ప్రభుత్వ సమీక్ష తప్పనిసరి చేస్తూ వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయడానికి సిద్ధమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu