Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐరోపా పర్యటనలో మోదీ..మీడియాకు నో!

ఐరోపా పర్యటనలో మోదీ..మీడియాకు నో!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐరోపా పర్యటనలో భాగంగా నార్వే ప్రధానితో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశం అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ సమావేశంలో ప్రధాని మోదీ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోవడంపై, ఆ తర్వాత జరిగిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) బ్రీఫింగ్‌లో విలేకరులు అధికారులను నిలదీశారు. ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన మీడియా అడిగే ప్రశ్నలకు ప్రధాని ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎంఈఏ సెక్రటరీ (వెస్ట్) సిబి జార్జ్ మరియు ఒక నార్వేజియన్ జర్నలిస్ట్ మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది.

ఐదు దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), నెదర్లాండ్స్, స్వీడన్ దేశాలను సందర్శించిన అనంతరం ప్రధాని మోదీ నార్వే రాజధాని ఓస్లోకు చేరుకున్నారు. మే 19న ఆయన ఇటలీకి వెళ్లాల్సి ఉంది. నార్వేకు చెందిన పత్రికా వ్యాఖ్యాత హెల్లే లింగ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక వీడియోను పంచుకున్నారు. ప్రధాని మోదీ ఉమ్మడి ప్రకటన ముగించుకుని వేదిక నుండి బయటకు వెళ్తుండగా, ఒక మహిళా విలేకరి గట్టిగా.. ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన ప్రెస్ నుండి కొన్ని ప్రశ్నలు ఎందుకు తీసుకోరు? అని అడగడం ఆ వీడియోలో వినిపించింది. దీనిపై ఆమె క్యాప్షన్ ఇస్తూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, ఆయన ఇస్తారని నేను ముందే ఆశించలేదు అని పేర్కొన్నారు.

ఈ వివాదం ఆ తర్వాత జరిగిన ఎంఈఏ అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్‌కు కూడా పాకింది. అదే నార్వేజియన్ జర్నలిస్ట్ భారత అధికారులను మానవ హక్కులు, నమ్మకం అనే అంశాలపై నేరుగా ప్రశ్నించారు. భారతదేశ విశిష్టతను వివరిస్తూ సిబి జార్జ్ విలేకరికి గట్టి కౌంటర్ ఇచ్చారు. భారతదేశాన్ని ప్రపంచం ఎందుకు నమ్మాలో నేను చెబుతాను. ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారితో అతలాకుతలమైనప్పుడు భారత్ గుహల్లో దాక్కోలేదు. ప్రపంచాన్ని రక్షించలేమని వెనకడుగు వేయలేదు. ప్రపంచ దేశాలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఆ సేవా గుణమే నమ్మకాన్ని సృష్టించింది. ఆ నమ్మకాన్ని ప్రపంచం గుర్తించినందుకు మాకు సంతోషంగా ఉంది అన్నారు.

ప్రపంచ జనాభాలో మేము ఆరో వంతు ఉన్నాము, కానీ ప్రపంచంలో ఉన్న సమస్యల్లో మా వాటా ఆరో వంతు లేదు. మాకు పౌరుల ప్రాథమిక హక్కులకు గ్యారెంటీ ఇచ్చే అద్భుతమైన రాజ్యాంగం ఉంది. ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం వాటిల్లితే, వారు నేరుగా కోర్టుకు వెళ్లే హక్కు ఉంది. మేము ప్రజాస్వామ్య దేశంగా ఉన్నందుకు గర్విస్తున్నాము అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐరోపా పర్యటనలో భాగంగా నార్వే ప్రధానితో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశం అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోవడంపై, ఆ తర్వాత జరిగిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) బ్రీఫింగ్‌లో విలేకరులు అధికారులను నిలదీశారు. ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన మీడియా అడిగే ప్రశ్నలకు ప్రధాని ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎంఈఏ సెక్రటరీ (వెస్ట్) సిబి జార్జ్ మరియు ఒక నార్వేజియన్ జర్నలిస్ట్ మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu