Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అశ్విన్‌కు 'సారీ' చెప్పిన అర్ష్‌దీప్!

అశ్విన్‌కు 'సారీ' చెప్పిన అర్ష్‌దీప్!

నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా ఐదుగురు అత్యుత్తమ బౌలర్లను ఎంచుకోవాల్సిందిగా కోరగా… అర్ష్‌దీప్ సింగ్ వరుసగా భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, చాహల్, మరియు రవిచంద్రన్ అశ్విన్‌ల పేర్లను వెల్లడించాడు.

అయితే ఈ జాబితాలో అశ్విన్‌ను చివరి (5వ) స్థానంలో పేర్కొనడంపై అర్ష్‌దీప్ సరదాగా స్పందిస్తూ ఆయన్ను చివరి స్థానంలో ఉంచడం తన ఉద్దేశం కాదని స్థానాలు ఖాళీ లేకపోవడం వల్లే అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. సారీ అష్ భాయ్…నీకు వ్యక్తిగతంగా మెసేజ్ చేస్తాను అని సరదాగా వ్యాఖ్యానించాడు.

ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అర్ష్‌దీప్…భువి భాయ్ నాకు పర్సనల్ ఫేవరెట్, అందుకే నా ఓటు ఆయనకే. ఆ విషయంలో నేను కొంచెం పక్షపాతంతో వ్యవహరించి ఉండవచ్చు! అందుకే ముందుగా ఫాస్ట్ బౌలర్లకే ప్రాధాన్యత ఇస్తున్నా. రెండవ స్థానంలో షమీ భాయ్‌ను ఉంచుతాను. ఎందుకంటే ఆయన ఎలాంటి వికెట్‌పైనైనా బంతిని సీమ్ చేయగలడు, ఆయన బౌలింగ్ శైలి అద్భుతం అని కొనియాడాడు.

మూడో స్థానంలో కుల్దీప్ యాదవ్ ఉంటాడు ఎందుకంటే ఆయనది అరుదైన 'లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్' నైపుణ్యం. ఆ తర్వాత పంజాబ్ టీమ్‌లో నా సహచరుడైన యుజీ (చాహల్) భాయ్ ఉంటాడు, ఆయన రికార్డులు అద్భుతం, ఎన్నో వికెట్లు తీశాడు. ఇక అష్ భాయ్‌ను చివరి స్థానంలో పెట్టాలని నాకు లేదు, కానీ స్థానాలు ఖాళీ లేకపోవడంతో ఆయన్ను 5వ స్థానంలో ఉంచాల్సి వచ్చింది. ఐపీఎల్‌లో పంజాబ్ జట్టుకు ఆడేటప్పుడు అష్ భాయ్ నా మొదటి కెప్టెన్ ఆయన ఎంతో గొప్ప వ్యక్తి…. సారీ అష్ భాయ్ నీకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తాను అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

ఆగస్టు 15 నుండి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు భారత్ సన్నద్ధమవుతుండగా, ప్రస్తుతం కేవలం పరిమిత ఓవర్ల (వైట్ బాల్) క్రికెట్ మాత్రమే ఆడుతున్న అర్ష్‌దీప్ సింగ్ విశ్రాంతిలో ఉన్నాడు.

నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా ఐదుగురు అత్యుత్తమ బౌలర్లను ఎంచుకోవాల్సిందిగా కోరగా… అర్ష్‌దీప్ సింగ్ వరుసగా భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, చాహల్, మరియు రవిచంద్రన్ అశ్విన్‌ల పేర్లను వెల్లడించాడు. అయితే ఈ జాబితాలో అశ్విన్‌ను చివరి (5వ) స్థానంలో పేర్కొనడంపై అర్ష్‌దీప్ సరదాగా స్పందిస్తూ ఆయన్ను చివరి స్థానంలో ఉంచడం తన ఉద్దేశం కాదని స్థానాలు ఖాళీ లేకపోవడం వల్లే అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. సారీ అష్ భాయ్…నీకు వ్యక్తిగతంగా మెసేజ్ చేస్తాను అని సరదాగా వ్యాఖ్యానించాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu