రాజకీయ బలంతో సామాన్యులను అణచివేయలేరని నిరూపిస్తూ, తన కూతురికి జరిగిన అన్యాయంపై తల్లి గళమెత్తింది. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన POCSO కేసులో బాధితురాలి తల్లి విడుదల చేసిన ప్రెస్ నోట్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
2025లో స్నేహంతో మొదలైన పరిచయం, తన కూతురి జీవితాన్ని అతలాకుతలం చేసిందని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. భగీరథ్ తన కూతురిని మానసికంగా లోబర్చుకుని, చదువుకు దూరం చేయడమే కాకుండా, గత ఏడాది డిసెంబర్ 31న బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించారు. అపార్ట్‌మెంట్‌లలో బంధించి పలుమార్లు అఘాయిత్యాలకు పాల్పడినట్లు బాధితురాలు జనవరి 2026లో తన తల్లిదండ్రులకు వివరించింది.
న్యాయం కోసం మే 8న పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయిస్తే, గంటల తరబడి వేచి చూసేలా చేశారని ఆమె పేర్కొన్నారు. ఎట్టకేలకు FIR నమోదైనప్పటికీ, నిందితుడికి సులభంగా బెయిల్ వచ్చేలా బలహీనమైన సెక్షన్లు పెట్టారని ఆరోపించారు. మరీ ముఖ్యంగా, తాము స్టేషన్‌లో ఉన్న సమయంలోనే, బాధితురాలిపై కరీంనగర్‌లో ఎదురు కేసు పెట్టడం వెనుక ఉన్న కుట్రను ఆమె ఎండగట్టారు.
విచారణ నిష్పక్షపాతంగా జరగాలని ఆమె కోరారు. అలాగే, సోషల్ మీడియా మరియు మీడియా ప్రతినిధులు తన కూతురి ఫోటోలను, గుర్తింపును బయటపెట్టవద్దని చేతులు జోడించి విన్నవించారు.