పోక్సో కేసులో బండి భగీరథ్‌కు మరో షాక్ తగిలింది. భగీరథ్‌పై మరో సెక్షన్ BNS 64(2)(M) సెక్షన్ నమోదు అయింది. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడని మరో సెక్షన్‌ను జత చేశారు పోలీసులు.
నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.
అలాగే POCSO నిందితుడు బండి భగీరథ్ కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు అయ్యాయి. నిందితుడికి మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసినందుకు గానూ 14 మంది ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
నిందితుడు బండి భగీరథ్ ఇమేజ్‌ను క్లీన్ చేయడానికి పెద్ద ఎత్తున డబ్బు తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా కంటెంట్ చేసినట్లు గుర్తించారు. పోక్సో కేసు నిందితులకు అనుకూలంగా ప్రచారం చేయడం, బాధితుల వివరాలను పరోక్షంగా ప్రస్తావించడం చట్టరీత్యా నేరం కావడంతో ఈ చర్యలు తీసుకున్నారు పోలీసులు.
ఈ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మొత్తం 27 మందిపై ఫిర్యాదు అందగా.. ప్రాథమిక విచారణ జరిపి మొదటి విడతగా మొత్తం 14 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై అధికారికంగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయగా మిగిలిన వారిపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు మరో షాక్ తగిలింది. భగీరథ్‌పై మరో సెక్షన్ BNS 64(2)(M) సెక్షన్ నమోదు అయింది. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడని మరో సెక్షన్‌ను జత చేశారు పోలీసులు. నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

