Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత జట్టు ఎంపికపై బద్రీనాథ్

భారత జట్టు ఎంపికపై బద్రీనాథ్

భారత జట్టు ఎంపిక అంతా శుభ్‌మన్ గిల్ ఇష్టాయిష్టాల ప్రకారమే జరుగుతోందని.. ప్రధాన కోచ్ కంటే కూడా కెప్టెన్‌దే తుది నిర్ణయంగా కనిపిస్తోందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్.శ్రీలంకతో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించలేకపోయింది.

రెండు జట్ల మధ్య జరిగిన ఈ రెండు టెస్టుల సిరీస్‌లో.. గాళ్లేలో జరిగిన మొదటి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

అయితే రెండో టెస్టులో శ్రీలంక జట్టు గట్టి పోటీని ఇచ్చింది. ఐదో రోజు అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభను కనబరిచి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శనను చూసిన పలువురు విశ్లేషకులు, జట్టు ఎంపికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ విషయంపై మాట్లాడిన భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్.. భారత జట్టు ఎంపిక ప్రక్రియ శుభ్‌మన్ గిల్ నిర్ణయాలకు అనుగుణంగా జరుగుతోందని, హెడ్ కోచ్ కంటే కెప్టెన్‌దే తుది నిర్ణయంగా తా భావిస్తున్నట్లు తెలిపారు.

శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ భారత జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. భారత్ ఇంగ్లాండ్‌లో బాగా ఆడింది, ఇప్పుడు శ్రీలంకలోనూ మంచి ప్రదర్శన చేసింది. ఒక యువ జట్టును అతను ఎంతో బాగా నడిపిస్తున్నాడు. గౌతమ్ గంభీర్ కఠినమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అయినప్పటికీ.. ఫలితాలకు కెప్టెనే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి, గిల్లే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ జట్టును ఎంపిక చేస్తున్నాడని నేను భావిస్తున్నాను అని బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానెల్‌లోని ఒక వీడియోలో పేర్కొన్నారు.

అంతేకాకుండా ఈ సిరీస్‌లో స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కనబరిచిన అద్భుత ప్రదర్శనను బద్రీనాథ్ కొనియాడారు. రెండు టెస్టు మ్యాచ్‌లలో రెండు సెంచరీలు సాధించిన పడిక్కల్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. దీనిపై బద్రీనాథ్ మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్‌లో భారత్‌కు మూడో స్థానంలో పడిక్కల్ తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడని, ఇకపై ఆ స్థానం గురించి భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

భారత జట్టు ఎంపిక అంతా శుభ్‌మన్ గిల్ ఇష్టాయిష్టాల ప్రకారమే జరుగుతోందని.. ప్రధాన కోచ్ కంటే కూడా కెప్టెన్‌దే తుది నిర్ణయంగా కనిపిస్తోందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్.శ్రీలంకతో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించలేకపోయింది. రెండు జట్ల మధ్య జరిగిన ఈ రెండు టెస్టుల సిరీస్‌లో.. గాళ్లేలో జరిగిన మొదటి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu