బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం చేపట్టిన తోపుడు బండ్ల (హాకర్ల) బలవంతపు తొలగింపులు మరియు బుల్డోజర్ సంస్కృతికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC) మే 21న పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనుంది.
మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారనే ఆరోపణలకు నిరసనగా హౌరా స్టేషన్, సీల్దా స్టేషన్ మరియు బల్లిగంజ్ సమీపంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ నిరసనల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు.
మంగళవారం కాళీఘాట్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వంలో మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇక్కడ మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తున్నారు. హాకర్ల దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. ఈ ప్రభుత్వం మన రాజ్యాంగ ఆలోచనలను, విలువలను దెబ్బతీస్తోంది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో కూడా బీజేపీని అధికారం నుంచి దించుతాం అని మమతా బెనర్జీ అన్నారు.
టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ బీజేపీపై తమ రాజకీయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.పార్టీ శాసనసభ్యులను ఉద్దేశించి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ, రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వాన్ని విమర్శించారు మరియు తాము ఎవరికీ భయపడేది లేదని అన్నారు. వారు ఏమి చేయాలనుకుంటే అది చేయనివ్వండి… నా ఇంటిని కూల్చివేయనివ్వండి, నోటీసులు పంపనివ్వండి… నేను దేనికీ లొంగిపోను. ఏది ఏమైనా బీజేపీకి వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతుంది అన్నారు.
బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం చేపట్టిన తోపుడు బండ్ల (హాకర్ల) బలవంతపు తొలగింపులు మరియు బుల్డోజర్ సంస్కృతికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC) మే 21న పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనుంది.

