Dailyhunt
బీజేపీలో చేరిన ఆప్ నేత ఫూల్కా!

బీజేపీలో చేరిన ఆప్ నేత ఫూల్కా!

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు 2027కు ముందు కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఆప్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ న్యాయవాది హెచ్‌ఎస్ ఫూల్కా భారతీయ జనతా పార్టీలో చేరారు.న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఫూల్కా అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్, ఇతర నేతలు పాల్గొన్నారు.

సుమారు ఏడు సంవత్సరాల విరామం తర్వాత ఫూల్కా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. హర్విందర్ సింగ్ ఫూల్కా సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా పనిచేశారు. ముఖ్యంగా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు న్యాయం అందించేందుకు దీర్ఘకాలంగా న్యాయపోరాటం చేసిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

2014లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.అదే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో లుధియానా నుంచి పోటీ చేసి ఓడిపోయారు.2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ధాకా నియోజకవర్గం నుంచి గెలిచారు. తరువాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు.ఫూల్కా బీజేపీలో చేరడం పంజాబ్ రాజకీయాల్లో కీలకంగా భావిస్తున్నారు. ముఖ్యంగా 2027 ఎన్నికల ముందు ఇది బీజేపీకి బలాన్నిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు 2027కు ముందు కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఆప్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ న్యాయవాది హెచ్‌ఎస్ ఫూల్కా భారతీయ జనతా పార్టీలో చేరారు.న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఫూల్కా అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్, ఇతర నేతలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu