ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది.
డెడికేటెడ్ కమిషన్ సేకరించిన గణాంకాలు, అందించిన సిఫార్సుల ఆధారంగానే రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
మేయర్ పదవులు: 35.29 శాతం,మున్సిపల్ చైర్మన్ పదవులు: 33.02 శాతం,అర్బన్ వార్డులు: 32.78 శాతం,పంచాయతీ వార్డులు: 26.73 శాతం,సర్పంచ్ పదవులు: 27.95 శాతం,ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు: 24.6 శాతం,పార్టీ పరంగా బీసీలకు 34% సీట్లు ఇస్తామని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
బీసీ వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మరియు రాజ్యాంగబద్ధంగా వారికి తగిన న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చట్టబద్ధమైన రిజర్వేషన్ల పరిమితి వల్ల ఎక్కడైనా బీసీలకు సీట్లు తగ్గినట్లయితే, అక్కడ పార్టీ పరంగా అభ్యర్థులను నిలబెట్టి బీసీల స్థానాలను భర్తీ చేస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. డెడికేటెడ్ కమిషన్ సేకరించిన గణాంకాలు, అందించిన సిఫార్సుల ఆధారంగానే రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

