మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ వాల్తేర్ వీరయ్య తర్వాత మరో మాస్ ఎంటర్‌టైనర్ కోసం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లితో మరోసారి జతకడుతున్న సంగతి తెలిసిందే.
నేడు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభంకాగా మెగా బ్రదర్స్ చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, నాగబాబు హాజరయ్యారు. మెగాబ్రదర్స్ అందరిని ఒకే ఫ్రేమ్‌లో చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. #చిరుబాబీ కాంబోలో ఇది రెండో సినిమా కాగా #చిరు కెరీర్‌లో ఇది 158వ చిత్రం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ ఈ చిత్రానికి డీవోపీగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మేకర్స్ మరో టాప్ టాలెంట్‌ను టీమ్‌లోకి ఆహ్వానించారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా టీంలో చేరారు.
మెగాస్టార్ చిరంజీవిని ఇప్పటివరకు ఎప్పుడూ చూడని అత్యంత ఫెరోషియస్ అవతార్‌లో ప్రజెంట్ చేయడానికి, భారీ స్థాయి సినిమాటిక్ వరల్డ్‌ను తన విజన్, ఎక్స్‌పర్టైజ్‌తో అవినాష్ కొల్లా అద్భుతంగా ఆవిష్కరించనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న బాబీ కొల్లి, ఈసారి చిరంజీవిని ఇప్పటివరకు చూడని అత్యంత పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నారు. మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత ఎలివేట్ చేసేలా రూపొందుతున్న ఈ చిత్రం పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, హై వోల్టేజ్ ఎలివేషన్స్, థియేటర్లను షేక్ చేసే మాస్ మూమెంట్స్‌తో ఉండబోతోంది.ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ వాల్తేర్ వీరయ్య తర్వాత మరో మాస్ ఎంటర్‌టైనర్ కోసం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లితో మరోసారి జతకడుతున్న సంగతి తెలిసిందే. నేడు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభంకాగా మెగా బ్రదర్స్ చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, నాగబాబు హాజరయ్యారు. మెగాబ్రదర్స్ అందరిని ఒకే ఫ్రేమ్‌లో చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

