Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CJP పార్టీపై ఆర్‌ఎస్‌ఎస్ స్పందన!

CJP పార్టీపై ఆర్‌ఎస్‌ఎస్ స్పందన!

సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) పై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్పందించింది. ప్రజాస్వామ్య సమాజంలో విభిన్న అభిప్రాయాలు, బహిరంగ చర్చలు చాలా సహజమైనవని..

దీనిని చూసి దిగ్భ్రాంతి చెందాల్సిన అవసరం లేదని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ స్పష్టం చేశారు. ఈ సరికొత్త ఇంటర్నెట్ ట్రెండ్ యువత (Gen-Z) ఆలోచనలకు ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అధికార బీజేపీతో సహా పలు ప్రధాన రాజకీయ పార్టీల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుని ఈ డిజిటల్ కూటమి వార్తల్లో నిలిచింది.

భారతదేశంలో బలమైన ప్రజాస్వామ్య ప్రక్రియ ఉందని సునీల్ అంబేకర్ గుర్తుచేశారు. ఇక్కడ పారదర్శకమైన ఎన్నికలు, స్వేచ్ఛా మీడియా, విశాలమైన సోషల్ మీడియా వేదికలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఇటువంటి ఓపెన్ ఫోరమ్స్ చర్చలు జరుగుతుంటాయని.. విభిన్న కోణాల్లో ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం సాధారణ ప్రక్రియలో భాగమేనని వివరించారు. కాక్రోచ్ జనతా పార్టీ వెనుక కొన్ని శక్తుల హస్తం ఉందంటూ బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఆర్‌ఎస్‌ఎస్ నేత వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సంస్థకు చెందిన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను ప్రభుత్వం ఇప్పటికే బ్లాక్ చేయగా.. ఆ వ్యవహారం ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉంది.

దేశంలోని నేటి తరం యువత (Gen Z) ఎంతో ఆశాభావంతో ఉన్నారని.. వారికి దేశం పట్ల పూర్తి నమ్మకం ఉందని అంబేకర్ కొనియాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు కూడా యువత శక్తిసామర్థ్యాలపై అపారమైన విశ్వాసం ఉందన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు అందరి గొంతుకలను, భావోద్వేగాలను కలుపుకుని పోయే గొప్ప సామర్థ్యం ఉందని.. ప్రజలంతా ఆ వ్యవస్థను నమ్మాలని పిలుపునిచ్చారు.

ఇలాంటి అంశాలపై ఆర్‌ఎస్‌ఎస్ నేరుగా స్పందించాల్సిన అవసరం లేదని సునీల్ అంబేకర్ అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ పార్టీలు, మీడియా ఇలాంటి విషయాలను పరిష్కరించేంత సమర్థవంతంగా ఉన్నాయని చెప్పారు. మన వ్యవస్థలు ఏమాత్రం బలహీనంగా లేవని.. అందువల్ల ఈ వివాదాల్లోకి ఆర్‌ఎస్‌ఎస్ వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) పై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్పందించింది. ప్రజాస్వామ్య సమాజంలో విభిన్న అభిప్రాయాలు, బహిరంగ చర్చలు చాలా సహజమైనవని.. దీనిని చూసి దిగ్భ్రాంతి చెందాల్సిన అవసరం లేదని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ స్పష్టం చేశారు. ఈ సరికొత్త ఇంటర్నెట్ ట్రెండ్ యువత (Gen-Z) ఆలోచనలకు ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అధికార బీజేపీతో సహా పలు ప్రధాన రాజకీయ పార్టీల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుని ఈ డిజిటల్ కూటమి వార్తల్లో నిలిచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu