Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశవ్యాప్తంగా 'క్యాండిల్ మార్చ్'కు సీజేపీ పిలుపు..

దేశవ్యాప్తంగా 'క్యాండిల్ మార్చ్'కు సీజేపీ పిలుపు..

NEET (UG) పరీక్షల అక్రమాల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అనంతరం దేశ రాజధానిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే పిలుపు మేరకు, నీట్ వ్యవహారంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల స్మారకార్థం మరియు వారికి నివాళిగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా 'క్యాండిల్ మార్చ్' (మైనపువత్తుల ప్రదర్శన) మరియు మౌన ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

ఇది తమ సుదీర్ఘ పోరాటానికి మరియు భారత ప్రజాస్వామ్య విలువల విజడానికి లభించిన తొలి అడుగు మాత్రమేనని, విద్యార్థులందరూ శాంతియుతంగా ఈ క్యాండిల్ ర్యాలీలో పాల్గొని మరణించిన విద్యార్థులకు నివాళులు అర్పించాలని సీజేపీ కోరింది.

మరోవైపు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో పాటు ప్రభుత్వం నుంచి సానుకూల హామీలు లభించడంతో జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా సాగిన విద్యార్థుల ఆందోళనలు విరమించబడ్డాయి.

విద్యార్థులు తమ నిరసనను ఉపసంహరించుకోవడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలో మూసివేసిన పలు కీలక మెట్రో స్టేషన్లను అధికారులు తిరిగి తెరిచారు. రవాణా సేవలు, సాధారణ మెట్రో రైళ్ల రాకపోకలు పునరుద్ధరించబడటంతో ప్రయాణికులు మరియు స్థానికులు ఉపశమనం పొందుతున్నారు. ఢిల్లీ పోలీసులు కూడా జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలను సడలించారు.

NEET (UG) పరీక్షల అక్రమాల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అనంతరం దేశ రాజధానిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే పిలుపు మేరకు, నీట్ వ్యవహారంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల స్మారకార్థం మరియు వారికి నివాళిగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా 'క్యాండిల్ మార్చ్' (మైనపువత్తుల ప్రదర్శన) మరియు మౌన ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu