కాంగ్రెస్ సర్కార్ ధాన్యం కొనుగోళ్లు చేయక..10 మందికి పైగా రైతులు ధాన్యం కుప్పల మీదనే కుప్పకూలిపోయి చనిపోతే ..ఏ ఒక్కరూ కూడా చనిపోలేదని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు మాట్లాడడం సిగ్గు చేటు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్..ధాన్యం కొనుగోలు చేయకుండా ఇష్టమొచ్చినట్లు అబద్దాలు చెప్తున్నడు అన్నారు.
కేసీఆర్ పాలనలో పదేండ్లు దేశానికే అన్నపూర్ణగా వెలసిల్లిన తెలంగాణ.. ఇవ్వాళ తల్లడిల్లుతున్నది.. రైతు కన్నీరు పెడుతున్నడు…ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుండదు అన్నారు. మీకు భూ దోపిడి మీద ఉన్న శ్రద్ధ భూమిని నమ్ముకునే రైతుల మీద లేదు… మొన్న వేం నరేందర్ రెడ్డి భూ హారతి ద్వారా కేసముద్రంలో అసైన్డ్ పట్టాలు ఆక్రమించాడు … శంషాబాద్లో ముఖ్యమంత్రి అనుచరులు 90 ఎకరాల సీలింగ్ భూమిని ఎంఆర్వో, కలెక్టర్ స్థాయిలో ఉత్తర్వులు ఇచ్చి వేల కోట్ల భూమిని దోపిడి ఎలా చేశారో ఏసీబీ దాడిలో దొరికారు అన్నారు.
ఏ ఊరికైనా పోదాం.. ఎక్కడన్నా మీరు చెప్పినట్లు 80 శాతం పంట కొనుగోళ్లు చేశారని నిరూపిస్తే మేము ఏ శిక్షకైనా సిద్ధం .. ఓ కాంగ్రెస్ నాయకుడు మా పార్టీ నాయకుడికి ఫోన్ చేసి, ధాన్యం ప్రభుత్వం కొనుడు ఎందయ్యా, మాకు లేని పని పెట్టిండు మీ కేసీఆర్ అని చెప్తున్నాడు.. రాష్ట్రంలో ఇప్పటివరకు 35% ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు అన్నారు. కానీ రేవంత్ రెడ్డి, అతని మంత్రులు 80% కొనుగోలు చేశామని అబద్ధాలు చెప్తున్నారు…రైతుల ఇబ్బందుల మీద అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు అన్నారు.
నిజంగానే 2034 వరకు సీఎంగా ఉంటానని ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చెయ్ … నీకు అంత దమ్ము లేకపోతే మా పార్టీ నుండి తీసుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, ప్రజలే తీర్పు ఇస్తారు అన్నారు.