Delhi-NCR ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో నమోదైన ఈ భూకంపానికి కేంద్ర బిందువు ఆఫ్ఘానిస్తాన్‌లో ఉన్నట్లు సమాచారం.
ఈ భూకంప ప్రభావం ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా కనిపించింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా,ఉత్తరప్రదేశ్, జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో కూడా కంపనలు నమోదయ్యాయి.
భూకంపం సంభవించిన వెంటనే ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. జమ్మూ కాశ్మీర్‌లో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయానికి గురయ్యారు.
ప్రస్తుతం వరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.
భూకంప సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు
నేలపై కూర్చుని, బలమైన టేబుల్ లేదా డెస్క్ కింద ఆశ్రయం తీసుకుని, కంపనలు ఆగే వరకు పట్టుకుని ఉండాలి.
ఆశ్రయం లేకపోతే చేతులతో తల, మెడను రక్షించుకోవాలి.
ఇంట్లో ఉంటే బయటకు పరుగెత్తకూడదు.
కిటికీలు, గాజు వస్తువులు, అద్దాలు, పడిపోయే ప్రమాదం ఉన్న వస్తువుల నుంచి దూరంగా ఉండాలి.
బయట ఉంటే భవనాలు, చెట్లు, విద్యుత్ తీగల నుండి దూరంగా ఖాళీ ప్రదేశానికి వెళ్లాలి.
వాహనం నడుపుతున్నప్పుడు బ్రిడ్జ్‌లు, ఫ్లైఓవర్‌లు, భవనాల నుంచి దూరంగా సురక్షితంగా ఆపి, వాహనంలోనే ఉండాలి.
భూకంపం తర్వాత తీసుకోవాల్సిన చర్యలు
మీకు లేదా ఇతరులకు గాయాలు ఉన్నాయా పరిశీలించి, అవసరమైతే ప్రథమ చికిత్స అందించాలి.
ఆఫ్టర్‌షాక్స్ వచ్చే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలి.
గ్యాస్ లేదా విద్యుత్ లీకేజీ అనుమానం ఉంటే వెంటనే ఆపాలి.
దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్లకూడదు.
స్థానిక అధికారుల సూచనలను పాటించాలి.
Delhi-NCR ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో నమోదైన ఈ భూకంపానికి కేంద్ర బిందువు ఆఫ్ఘానిస్తాన్‌లో ఉన్నట్లు సమాచారం.

