అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇరాన్ విషయంలో కీలక నిర్ణయం దశకు చేరుకున్నట్లు సమాచారం. గడువు సమయం దగ్గరపడుతున్న వేళ, డీల్ కుదిరితే సైనిక చర్యలను వాయిదా వేసే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Axios నివేదిక ప్రకారం… ఒక ఒప్పందం రూపుదిద్దుకుంటుందని ట్రంప్ భావిస్తే, ఇరాన్‌పై ప్రణాళిక చేసిన దాడిని తాత్కాలికంగా నిలిపివేయవచ్చని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. "డీల్ కుదిరేలా కనిపిస్తే, ఆయన ఆగవచ్చు" అని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నట్లు సమాచారం.
అయితే చివరి నిర్ణయం పూర్తిగా ట్రంప్ చేతుల్లోనే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌కు స్పష్టమైన గడువు విధించారు. ఆ గడువు లోపు ఒప్పందం కుదరకపోతే, ఇరాన్ కీలక మౌలిక సదుపాయాలపై దాడులు జరగవచ్చని హెచ్చరించారు. ముఖ్యంగా విద్యుత్ కేంద్రాలు, వంతెనలు వంటి కీలక లక్ష్యాలు టార్గెట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తుల ద్వారా చర్చలు కొనసాగుతున్నాయి. 45 రోజుల కాలపరిమితి ఉన్న కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.ఇరాన్ కూడా తమ డిమాండ్లతో కూడిన ప్రతిపాదనను సమర్పించింది. అయితే ఈ ప్రతిపాదనలు ఇంకా తుది ఒప్పందానికి దారి తీసేలా లేవని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి.
ఒకవైపు చర్చలు కొనసాగుతుండగా, మరోవైపు సైనిక చర్యలకు కూడా సిద్ధత కొనసాగుతోంది. డీల్ కుదరుతుందా? లేక ఉద్రిక్తతలు పెరుగుతాయా? అన్నది ప్రస్తుతం కీలక ప్రశ్నగా మారింది.