#NTRNeel చిత్రానికి సంబంధించిన మొదటి గ్లింప్స్ (టీజర్) ఎట్టకేలకు విడుదలైంది. 'డ్రాగన్' అని పేరు పెట్టిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రగ్గడ్ మరియు ఇంటెన్స్ అవతార్‌లో కనిపించి అభిమానులకు కనువిందు చేశారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇవాళ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, మేకర్స్ ముందే ప్రకటించినట్లుగా మే 19 అర్ధరాత్రి ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
ఈ టీజర్‌ను తెలుగు, హిందీ, కన్నడ, తమిళం మరియు మలయాళంతో సహా ఐదు భాషల్లో విడుదల చేశారు. సినిమా ప్రకటించినప్పటి నుండి అప్‌డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఈ టీజర్ మరింత ఉత్సాహాన్ని నింపింది.

