Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎంసెట్‌లో తొలి ర్యాంక్..కేటీఆర్ విషెస్

ఎంసెట్‌లో తొలి ర్యాంక్..కేటీఆర్ విషెస్

ఎంసెట్ -2026 పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 156.63 మార్కులతో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్ సాధించిన చిలుక నగర్ డివిజన్‌కు చెందిన ప్రతిభావంతురాలు కొండల్ రెడ్డి కుమార్తె మల్లాడి రుషికి మాజీ మంత్రి BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో KTR గారి చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా రుషి గారిని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి …KTR నివాసం నానక్ రామ్ గూడ కి తీసుకెళ్ళి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా KTR గారు మాట్లాడుతూ, సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి చదివి రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు.

మల్లాడి రుషి విజయం చిలుక నగర్ డివిజన్‌తో పాటు మొత్తం ఉప్పల్ నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు. నేటి యువత లక్ష్యసాధన కోసం పట్టుదలతో ముందుకు సాగితే ఎలాంటి విజయాన్నైనా అందుకోవచ్చని రుషి నిరూపించిందని కొనియాడారు.

అలాగే విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన మరియు నిరంతర శ్రమతో చదివితే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం మరియు విద్యార్థి అంకితభావం కలిసి విజయానికి పునాది అవుతాయని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ మల్లాడి రుషి సాధించిన ఘన విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ, తెలంగాణ విద్యార్థులు దేశ స్థాయిలో తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. రుషి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ , మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రభుదాస్ BRS పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎంసెట్ -2026 పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 156.63 మార్కులతో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్ సాధించిన చిలుక నగర్ డివిజన్‌కు చెందిన ప్రతిభావంతురాలు కొండల్ రెడ్డి కుమార్తె మల్లాడి రుషికి మాజీ మంత్రి BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో KTR గారి చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu