Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫేక్ నోటిఫికేషన్ల పట్ల అప్రమత్తం!

ఫేక్ నోటిఫికేషన్ల పట్ల అప్రమత్తం!

మీరు ఆన్‌లైన్‌లో ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? అయితే అప్లికేషన్ ఫీజులు లేదా వ్యక్తిగత వివరాలను అడిగే ఉద్యోగ ప్రకటనల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి.ఫేక్ ఉద్యోగ ప్రకటనల ద్వారా అభ్యర్థుల నుండి రిజిస్ట్రేషన్, మెడికల్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేరుతో డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంది.

ప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత అధికారిక శాఖ లేదా ఏజెన్సీ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే నిర్ధారించుకోండి. అనుమానాస్పద వ్యక్తులకు మీ ఓటీపీ , ఆధార్ కార్డ్ వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం లేదా పాస్‌వర్డ్‌లను ఎప్పుడూ పంచుకోవద్దు.

సాధారణంగా ఉద్యోగార్థులు ఖాళీల వివరాల కోసం సోషల్ మీడియా మరియు ఇతర ఆన్‌లైన్ వేదికలను ఉపయోగిస్తుంటారు. అయితే ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సైబర్ నేరగాళ్లు నకిలీ నోటిఫికేషన్లను ప్రచారం చేస్తూ ఉద్యోగార్థులను బురిడీ కొట్టిస్తున్నారు.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఉద్యోగార్థులను హెచ్చరిస్తూ.. "ప్రభుత్వ ఉద్యోగాల పేరిట జరిగే మోసాల పట్ల జాగ్రత్త వహించండి!" అని పేర్కొంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించే నకిలీ ప్రకటనలు, వెబ్‌సైట్లు, ఈమెయిళ్లు మరియు సోషల్ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అభ్యర్థులు ఉద్యోగానికి ఎంపికయ్యారని లేదా షార్ట్‌లిస్ట్ అయ్యారని నమ్మించడానికి మోసగాళ్లు ఆకర్షణీయమైన మెసేజ్‌లను పంపుతారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్, వైద్య పరీక్షలు (మెడికల్ చెకప్) లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పేరిట వివిధ దశలను పూర్తి చేయాలని కోరతారు. ఈ ప్రక్రియలో మెడికల్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటూ రకరకాల పేర్లతో డబ్బులు వసూలు చేస్తారు. అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించే ముందైనా సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలి.

ప్రభుత్వ లోగో (Logo) ఉన్నంత మాత్రాన అది అసలైన నోటిఫికేషన్ కాదు. ఒక పోస్ట్ లేదా వెబ్‌సైట్‌పై ప్రభుత్వ లోగో లేదా రాజముద్ర ఉన్నంత మాత్రాన దానిని గుడ్డిగా నమ్మవద్దని పిఐబి స్పష్టం చేసింది. కేవలం వెబ్‌సైట్ రూపురేఖలను చూసి మోసపోకుండా సంబంధిత ప్రభుత్వ శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సొంతంగా వివరాలను సరిచూసుకోవాలి. అలాగే అనుమానాస్పద మెసేజ్‌లకు స్పందిస్తూ ఓటీపీ, ఆధార్ సంఖ్య, బ్యాంక్ వివరాలు లేదా పాస్‌వర్డ్‌లు వంటి సున్నితమైన సమాచారాన్ని పంచుకోవద్దని సూచించింది.

ALso Read:కాంగ్రెస్‌కు మరో సెగ..చిన్నారెడ్డి ఫైర్

ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చినా లేదా డబ్బులు డిమాండ్ చేసినా అభ్యర్థులు అనుమానించాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా అనుమానాస్పద ప్రకటనలు కనిపిస్తే అభ్యర్థులు PIB ఫ్యాక్ట్ చెక్‌కు పంపవచ్చు. నివేదించడానికి +91 8799711259 వాట్సాప్ నంబర్ లేదా factcheck@pib.gov.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

మీరు ఆన్‌లైన్‌లో ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? అయితే అప్లికేషన్ ఫీజులు లేదా వ్యక్తిగత వివరాలను అడిగే ఉద్యోగ ప్రకటనల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి.ఫేక్ ఉద్యోగ ప్రకటనల ద్వారా అభ్యర్థుల నుండి రిజిస్ట్రేషన్, మెడికల్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేరుతో డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంది.

ALso Read:కాంగ్రెస్‌కు మరో సెగ..చిన్నారెడ్డి ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Great Telangana Telugu