మల్టీ-లెవెల్ మార్కెటింగ్ మరియు పెట్టుబడుల పేరుతో వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
హర్యానాలో ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ బృందం, ప్రస్తుతం ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తోంది.
గతంలోనే నౌహీరా షేక్ కోర్టు ముందు సరెండర్ కావాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆమె నిబంధనలను ఉల్లంఘించడంతో, ఆమెకు లభించిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈడీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం నౌహీరా షేక్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ అయింది.
తనపై జారీ అయిన నాన్-బెయిలబుల్ వారెంట్‌పై స్టే విధించాలని కోరుతూ నౌహీరా షేక్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది. స్టే ఇచ్చేందుకు స్పష్టంగా నిరాకరించింది.
కోర్టు ఆదేశాల అనంతరం నౌహీరా షేక్ పరారీలో ఉన్నారు. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఆమె కదలికలపై నిఘా పెట్టారు. చివరకు ఆమె హర్యానాలోని గుర్గావ్ (గురుగ్రామ్)లో తలదాచుకున్నట్లు ఖచ్చితమైన సమాచారంతో ఈడీ అధికారులు అక్కడికి చేరుకుని ఆమెను అరెస్ట్ చేశారు. గుర్గావ్‌లో అదుపులోకి తీసుకున్న నౌహీరా షేక్‌ను ట్రాన్సిట్ రిమాండ్‌పై ఈడీ అధికారులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇక్కడ ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి, తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఈ అరెస్ట్‌తో హీరా గ్రూప్ బాధితుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.
మల్టీ-లెవెల్ మార్కెటింగ్ మరియు పెట్టుబడుల పేరుతో వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హర్యానాలో ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ బృందం, ప్రస్తుతం ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తోంది.

